ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (dr br ambedkar) స్మారకాన్ని శుక్రవారం (ఏప్రిల్ 14)న మధ్యాహ్నం సీఎం కేసీఆర్ (telangana cm kcr) ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ (prakash ambedkar) కూడా హాజరవుతున్నారు. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠంపై ఏర్పాటు చేసిన 125 అడుగుల మెటల్ విగ్రహావిష్కరణకు (125 feet ambedkar statue) ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీఠం లోపల అంబేడ్కర్ జీవిత ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్రాలతో ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఏడు గంటల పాటు ఈ మార్గం బంద్ ఉంటుంది. మధ్యాహ్నం గం.1 నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
వీవీ స్టాచ్యూ, నెక్లస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్ మార్గంలో రాకపోకలను అనుమతించరు. వీవీ స్టాచ్యూ నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను నిరంకారి, ట్యాంగ్ బండ్ నుండి పీవీ మార్గ్ కు వచ్చే వాహనాలను రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ వైపు నుండి ట్యాంక్ బండ్ వెళ్లే వాహనాలను లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా మళ్లిస్తారు. ట్యాంక్ బండ్ నుండి తెలుగు తల్లి జంక్షన్ వెళ్లే వాహనాలను ఇక్బాల్ మీదుగా మళ్లిస్తారు. నేడు ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ్, లుంబిని పార్క్ తెరుచుకోవు. ట్రాఫిక్ మళ్లింపు నేపథ్యంలో ఖైరతాబాద్, రవీంద్ర భారతి, లక్డీకాపూల్, కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్, హిమయత్ నగర్ లిబర్టీ తదితర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలపై ప్రభావం ఉంటుంది. కాబట్టి వాహనదారులు గమనించాలి. ఏదైనా సహాయం కావాలంటే 9010203626కు నెంబర్ కు ఫోన్ చేయాలి.
ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అవుతుంది. ఇది రాష్ట్ర సచివాలయం పక్కన, బుద్ధ విగ్రహానికి ఎదురుగా, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పక్కన ఉంది.
అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సాంకేతిక, తయారీ చర్యలను ఖరారు చేసేందుకు కనీసం రెండేళ్లు పట్టింది.
2018 ఏప్రిల్ 4న డీపీఆర్ రూపొందించడానికి కన్సల్టెన్సీ సేవల కోసం డిజైన్ అసోసియేట్స్ ను నియమిస్తూ ఎస్సీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కన్సల్టెన్సీ వృత్తాకార, చతురస్త్రాకార స్తూపాల డిజైన్లను సిద్ధం చేయగా, కేసీఆర్ వృత్తాకార నమూనాకు ఆమోదం తెలిపారు. పార్లమెంటు భవనం నమూనాలో సిద్ధం చేయాలని సూచించారు.
ఢిల్లీలోని రాంసుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రయివేటు లిమిటెడ్, మత్తురామ్ ఆర్ట్స్ స్టూడియోస్ ప్రయివేట్ లిమిటెడ్ కు చెందిన శిల్పుల పర్యవేక్షణలో డీపీఆర్ సిద్ధమైంది. 2020 సెప్టెంబర్ 16న ఎస్సీ సంక్షేమ శాఖ రూ.146.50 కోట్లకు పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది.
2021 జూన్ 6న ఒప్పందం చేసుకొని, ఏడాదిలో పూర్తి చేయాలని చెప్పారు.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ రోజున ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 300 మంది చొప్పున 119 నియోజకవర్గాల నుండి 35వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.
750 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపబడుతున్నాయి.
ఆహార ఏర్పాట్లు కూడా చేశారు. ఒక లక్ష స్వీట్ ప్యాకెట్లు, 1.50 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లు, అంతేమొత్తంలో ోనీళ్ల ప్యాకెట్లు ఏర్పాటు చేశారు.