బైశాఖీ (Baisakhi ) ఉత్సవాల్లో భాగంగా బేణీ సంగమం ప్రాంతంలో బెయిన్ గ్రామంలోని చెనానీలో ఈ ఘటన చోటుచేసుకుంది.బైశాఖీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు (devotees) పాదచారుల వంతెనపైకి ఒక్కసారిగా రావడంతో అది కుప్పకూలినట్లు తెలిపారు.
జమ్ముకాశ్మీర్(Jammu and Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. ఉదమ్పూర్ జిల్లాలోని బేని సంగం నిర్మించిన వంతెన కూలి 40 మంది పైగా గాయపడ్డారు .బైశాఖి (Baisakhi ) పర్వదినం సందర్భంగా బేని సంగానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఫుట్ బ్రిడ్జ్ (Footbridge) పైకి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లడంతో అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా సుమారు 40 మందికిపైగా గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘనటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు (police), సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రి(Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.