ఉచితాలు అధికంగా ఇవ్వడంతో కర్ణాటక అప్పుల్లో కూరుకుపోతుందని ఉపాధ్యాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో విద్య శాఖ అధికారులు స్పందించారు.
మనకు బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర బిచ్చగాళ్లు కనిపిస్తూ ఉంటారు. ఇక గుడి లాంటి ప్రదేశాల్లోనూ కొందరు అడుక్కుంటూ కూర్చోవడం చాలా సర్వసాధారణం. కానీ ఓ యువకుడు ఎయిర్ పోర్టులో బిచ్చగాడిగా మారాడు. ఆ బిచ్చం ఎత్తుకోవడం కూడా ఓ హైటె్ బిజినెస్ లా చేస్తున్నాడు. రోజుకి తక్కువలో తక్కువ రూ.50 నుంచి రూ.60వేలు సంపాదిస్తున్నాడు. మరి ఈ హైటెక్ బిచ్చగాడి గురించి మనమూ తెలుసుకుందామా..
మరకలు పడిన, మట్టి కొట్టుకుని పోయిన, చిరిగిన నోట్లను ఆర్బీఐ మార్కెట్ (Market)లో ఉంచదు. అందులో భాగంగా చాలా కాలం నుంచి నోట్ల శుద్ధీకరణ విధానం అనుసరిస్తోంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని సిరీస్ లు ఉన్న నోట్లను వెనక్కు తీసుకుని కొత్త నోట్లను జారీ చేస్తుంది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు (WFI), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan) నార్కో అనాలసిస్ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, తనతోపాటు మరో ఇద్దరికి కూడా నార్కో పరీక్షలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే హైటెక్ హంగులతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ మార్గాల్లో స్లీపర్ కోచ్ లను కూడా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ మెన్షనింగ్ జాబితాలో ఉంటేనే విచారిస్తామన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్ విచారించలేమని చెప్పిన వెకేషన్ బెంచ్ వెల్లడించిన జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ సంజయ్ ధర్మాసనం మెన్షనింగ్ అధికారికి సూచించిన అనిరుథ్ బోస్ ధర్మాసనం రేపు మళ్లీ వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని అవినాష్ ఉన్నట్లు సమాచారం
ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం సర్వం సిద్ధమైంది. సిడ్నీలో ప్రధాని మోదీతో కలిసి ఆస్ట్రేలియాలోని శక్తివంతమైన భారతీయ కమ్యూనిటీతో వేడుకలు జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తాను గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)ని దేవభూమి అంటారు. కేదార్‌నాథ్ ధామ్(Kedarnath Dham) ఈ దేవభూమిపై ఉంది. ఇక్కడి గోల్ ప్లాజాలో ఓం గుర్తు ఆకారం అమర్చబడనుంది. దీని బరువు 60 క్వింటాళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో రివర్ రాఫ్టింగ్‌లో పర్యాటకుల మధ్య జరిగిన షాకింగ్ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగా నది మధ్యలో తెడ్డులతో ఒకరినొకరు హింసాత్మకంగా కొట్టుకుంటున్న పర్యాటకుల సమూహాలను ఇందులో చూడవచ్చు.
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని చింగ్రిపోటాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బెంగళూరు(Bengaluru) నగరాన్ని ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలుల వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో చెట్లు కూలి వాహనాలు(Vehicles) ధ్వంసం అయ్యాయి.