బీబీసీ(BBC)కి ఢిల్లీ హైకోర్టు(Delhi Highcourt) నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. ”ఇండియా: ది మోదీ క్వశ్చన్”(India: The Modi Question) పేరుతో బీబీసీ గతంలో రెండు పార్టులుగా డాక్యుమెంటరీ(Documentory)లను ప్రసారం చేసింది. ఆ అంశంపై తమకు వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు బీబీసీకి ఆదేశాలు ఇచ్చింది. డాక్యుమెంటరీతో దేశం పరువు తీశారని గుజరాత్ కు చెందిన జస్టిస్ ఫర్ ట్రయల్ అనే ఎన్జీవో(NGO) సంస్థ బీబీసీపై కేసు వేసింది.
ఆ ఎన్జీవో(NGO) సంస్థ వేసిన పిటీషన్ పై విచారణ సాగుతోంది. ఈ తరుణంలో జస్టిస్ సచిన్ దత్త బీబీసీ(BBC)కి నోటీసులిచ్చారు. వెంటనే వివరణ ఇవ్వాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు. బీబీసీ యూకే ఆ డాక్యుమెంటరీ(Documentory)ని విడుదల చేసినట్లు పరువునష్టం దావాలో పేర్కొన్నారు.
ఎన్టీవో(NGO) తరపున సీనియర్ అడ్వకేట్ అయిన హరీశ్ సాల్వే తమ వాదనలు వినిపించారు. దేశం ప్రతిష్టను దెబ్బతీసేలా డాక్యమెంటరీ(Documentory) ఉందని, న్యాయవ్యవస్థను కించపరిచేలా ఆ డాక్యుమెంటరీ ఉన్నట్లు దావాలో తెలియజేశారు. స్థానిక ఆపరేటర్ అయిన బీబీసీ ఇండియా(BBC India) ఇలా చేయడం తప్పని మరికొందరు కూడా వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 15న చేపట్టనున్నట్లు కోర్టు(Highcourt) వెల్లడించింది.