బెంగళూరు(Bengaluru) నగరాన్ని ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలుల వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో చెట్లు కూలి వాహనాలు(Vehicles) ధ్వంసం అయ్యాయి.
కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు(Bengaluru) నగరాన్ని ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలుల వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో చెట్లు కూలి వాహనాలు(Vehicles) ధ్వంసం అయ్యాయి. కేఆర్ సర్కిల్ వద్ద వరద నీరు పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై అనేక వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. కార్లలో చాలా మంది చిక్కుకుపోయారు.
వాహనాల్లో(Vehicles) చిక్కుకున్న పలువురిని స్థానికులు వెలుపలికి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సీఎం సిద్ధరామయ్య(CM siddaramaih) సందర్శించి వైద్యులతో మాట్లాడారు. కేఆర్ సర్కిల్ వద్ద వరద కారణంగా కారులో చిక్కుకుని ఏపీకి చెందిన భానురేఖ(Bhanu Rekha) అనే మహిళ మరణించింది. భానురేఖ మృతికి సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వం తరపున ఆమె కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. భానురేఖ బెంగళూరులో ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తోంది. కారులో చిక్కుకుని ఆమె తీవ్రంగా గాయపడి చనిపోయింది.