»No Need To Rush For Rs 2000 Note Exchange Says Rbi Governor Shaktikanta Das
Rs.2000 Note రద్దు ప్రభావం మనపై ఉండదు: ఆర్బీఐ కీలక ప్రకటన
మరకలు పడిన, మట్టి కొట్టుకుని పోయిన, చిరిగిన నోట్లను ఆర్బీఐ మార్కెట్ (Market)లో ఉంచదు. అందులో భాగంగా చాలా కాలం నుంచి నోట్ల శుద్ధీకరణ విధానం అనుసరిస్తోంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని సిరీస్ లు ఉన్న నోట్లను వెనక్కు తీసుకుని కొత్త నోట్లను జారీ చేస్తుంది.
అకస్మాత్తుగా నోట్ల రద్దు చేయడంపై (Rs 2000 Note Withdraw) దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ పాలనపై విపక్ష పార్టీలతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు నోట్ల రద్దు చేస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. అయితే నోట్ల రద్దుపై తీవ్ర ఆందోళనలు, విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) స్పందించింది. ఎట్టకేలకు ఆర్బీఐ గవర్నర్ (Governor) శక్తికాంత దాస్ (Shaktikanta Das) మీడియాతో మాట్లాడారు. అన్నీ అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.
‘రిజర్వ్ బ్యాంక్ (RBI) నగదు నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగా రూ.2 వేల నోట్లను వెనక్కు తీసుకున్నాం. మరకలు పడిన, మట్టి కొట్టుకుని పోయిన, చిరిగిన నోట్లను ఆర్బీఐ మార్కెట్ (Market)లో ఉంచదు. అందులో భాగంగా చాలా కాలం నుంచి నోట్ల శుద్ధీకరణ విధానం అనుసరిస్తోంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని సిరీస్ లు ఉన్న నోట్లను వెనక్కు తీసుకుని కొత్త నోట్లను జారీ చేస్తాం. 2013-14లోనూ ఇలాంటి కసరత్తు చేసింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను వెనక్కు తీసుకున్నాం. కొత్త నోట్లు (New Notes) జారీ చేశాం. అదే మాదిరి ప్రస్తుతం రూ.2 వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నాం. వాటి చట్టబద్ధత మాత్రం కొనసాగుతుంది’ అని శక్తికాంత దాస్ ఓ ప్రకటనలో తెలిపారు.
నోట్ల రద్దుతో సెప్టెంబర్ 30వ తేదీలోపు రూ.2 వేల నోట్లన్నీ వెనక్కు (Return) వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నోట్ల డిపాజిట్ సమయంలో రూ.50 వేలు మించితే పాన్ కార్డు (Pan Card) తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థపై (Economic System) ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. భారత కరెన్సీ (Currancy) నిర్వహణ వ్యవస్థ చాలా సమర్థంగా ఉందని శక్తికాంత దాస్ ప్రకటించారు.