ఆటలో గొడవలు జరగడం సహజం. వాటిని మరచిపోయి మళ్లీ యథావిధిగా ఆడడం గొప్ప విషయం. కానీ ఐపీఎల్ (IPL)లో జరిగిన గొడవ మాత్రం ఇప్పట్లో సమసిపోయే విషయం కాదన్నట్టుగా కనిపిస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్నో సూపక్ కింగ్స్ (Lucknow Super Giants) బౌలర్ నవీన్ ఉల్ హక్ (Naveen-ul-Haq) మధ్య గొడవ మరింత ముదురుతోంది. తాజాగా ఆర్సీబీ (RCB) ఐపీఎల్ నుంచి నిష్క్రమించడంతో నవీన్ ఆనందంలో మునిగాడు. కోహ్లీకి బాగా అయ్యిందనే ఉద్దేశంతో నవ్వుతున్న వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది. కాగా అతడి స్టోరీపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ (Playoffs) చేరుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమిపాలైంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం (M Chinnaswamy Stadium) వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేతిలో కోహ్లీ జట్టు పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆర్సీబీ, కోహ్లీ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఐపీఎల్ ప్రారంభమై 16 ఏళ్లయినా ట్రోఫీ (Trophy) సాధించలేకపోతున్నామని ఆవేదనకు గురయ్యారు. బెంగళూరు అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లగా నవీన్ ఉల్ హక్ మాత్రం పండుగ చేసుకున్నాడు. ఆర్సీబీ ఇంటిబాట పట్టడంతో నవీన్ పట్టరాని ఆనందంలో మునిగాడు. ఈ సంద్భంగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో యాంకర్ నవ్వుతున్న వీడియోను షేర్ చేశాడు. గతంలో కోహ్లీతో గొడవ జరగడంతో నవీన్ ఈ విధంగా వీడియో పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే తాము ఓడిపోవడంతోనే ఆ వీడియో పెట్టినట్లు కోహ్లీ, ఆర్సీబీ అభిమానులు భావిస్తున్నారు.
సోషల్ మీడియా (Social Media) వేదికగా అతడి తీరుపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నవీన్ లిమిట్స్ దాటుతున్నావు జాగ్రత్త’ అని కొందరు హెచ్చరిస్తుండగా.. ‘అతడికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్’ అంటూ మరికొందరు కామెంట్లు (C0mments) చేస్తున్నారు. ‘కోహ్లీ రెండు సెంచరీలు చేవాడు.. నువ్వు ఏం చేశావ్ నవీన్?’ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ‘నవీనుల్ కామెంట్ సెక్షన్ ఆన్ చేసి ఉంటే అతడికి ఉండేది’ అని పేర్కొంటున్నారు. ఇలా నవీన్ ఉల్ ప్రవర్తనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అఫ్ఘానిస్తాన్ దేశానికి చెందిన నవీనుల్ తొలిసారి ఐపీఎల్ లో బరిలోకి దిగాడు. లక్నో తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అయితే కోహ్లీతో జరిగిన గొడవతో అందరికీ సుపరిచతమయ్యాడు.