KRNL: రాయలసీమ విశ్వవిద్యా లయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో 90 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా బుధవారం 8, 400 మందికి 7, 566 మంది హాజరు కాగా.. 834 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.