ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన యూజర్లకు చేదువార్త చెప్పింది.రెండు వేల నోటుకు సంబంధించిన కొత్త అప్డేట్ ఇచ్చింది.ఆర్బీఐ 2000 కరెన్సీ నోట్లును చలామణినుంచి ఉపసంహరించుకున్నతర్వాత క్యాష్ ఆన్ డెలివరీ(Cash on delivery) సేవకు అంగీకరించింది. క్యాష్ ఆన్ డెలివరీ (COD) సేవలపై 2000 నోట్లను అంగీకరించడాన్ని ఇకపై నిలిపివేయనుంది. సెప్టెంబర్ 19 నుండి 2000 కరెన్సీ నోట్లను నగదుగా స్వీకరించడాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.అయితే, ఉత్పత్తిని థర్డ్-పార్టీ కొరియర్ పార్టనర్ ద్వారా డెలివరీ చేస్తే, వీటిని అంగీకరిస్తున్నట్టు వెల్లడించింది. రూ.2,000 నోట్ల (Rs.2000 notes)ను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ (RBI) మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.
వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చింది. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో వీటిని చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఉపసంహరణ నేపథ్యంలో సెప్టెంబరు 1 నాటికి 90 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ఇటీవల తెలిపారు. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. తిరిగొచ్చిన రూ.2,000 నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చినట్లు చెప్పారు. మరోవైపు ఉపసంహరణ ప్రకటన వెలువడిన 20 రోజుల్లోనే చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. 2.72 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకులకు అందాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) జూలై 25 న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో పెర్కోన్నారు
ప్రతి నెలా కొన్ని రూల్స్ మారుతుంటాయి. కొత్త రూల్స్ అమలోకి వస్తుండటం అందరికీ తెలిసిందే. తాజాగా అక్టోబర్ నెలలో కూడా ఆర్థిక రంగంతో పాటుగా మరికొన్ని రంగాల్లో కీలక మార్పులు జరిగాయి. వాటి ఆధారంగా కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం.