ADB: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని AE తిరుపతి రెడ్డి అన్నారు. భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గృహజ్యోతి కరపత్రాలను స్థానికులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్తును అందజేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది, స్థానికులు తదితరులున్నారు.