»Vande Bharat Express Sleeper Coach Will Be Introduce Next Year
Vande Bharatలో ఇక ఎంచక్కా నిద్రపోవచ్చు.. త్వరలో స్లీపర్ కోచ్ లు
ఈ క్రమంలోనే హైటెక్ హంగులతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ మార్గాల్లో స్లీపర్ కోచ్ లను కూడా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
గమ్యస్థానాలకు వేగంగా వెళ్లేందుకు దోహదం చేస్తున్నవి వందే భారత్ (Vande Bharat Express) సెమీ హైస్పీడ్ రైళ్లు. ఈ రైలులో కూర్చునే సదుపాయం మాత్రమే ఉంది. ఇతర రైళ్ల మాదిరి నిద్రపోయేందుకు ఈ రైలులో (Train) సదుపాయాలు లేవు. ఆ లోటును కూడా తీర్చిదిద్దనున్నారు. ఇకపై వందే భారత్ రైళ్లల్లో నిద్రపోయి ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి రానుంది.
అనుకున్నంత స్థాయిలో ఈ రైళ్లు విజయం సాధించకపోవడంతో రైల్వే శాఖ (Indian Railways) పలు మార్పులు చేర్పులను చేయాలని నిర్ణయించింది. మరింత సౌకర్యవంతంగా.. మరింత పరిజ్ణానంతో (Technology) ఈ రైళ్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే హైటెక్ హంగులతో అత్యాధునిక సౌకర్యాలు (Facilities) కల్పించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ మార్గాల్లో స్లీపర్ కోచ్ (Sleeper Coach) లను కూడా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఆ స్లీపర్ కోచ్ లను కూడా మరింత వన్నె తెచ్చేలా తీసుకురావాలని భావిస్తున్నది.
ఇటీవల ఒడిశాలోని పూరీ (Puri)- పశ్చిమ బెంగాల్ లోని హౌరా (Howra) మధ్య వందేభారత్ రైళ్లు ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో రైల్వే అధికారులు స్లీపర్ కోచ్ ల విషయమై బయట పెట్టారు. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు డిజైన్ (Design) వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధమవుతుందని వెల్లడించారు. అయితే స్లీపర్ గరిష్ట వేగం (Highest Speed) 240 కిలో మీటర్లు ఉంటుందని తెలుస్తున్నది. కొత్త కోచ్ లు తయారుచేస్తున్నామని, ఇంటీరియర్ మొత్తం పూర్తిగా మారుతుందని రైల్వే శాఖ అధికారులు చెప్పారు. స్లీపర్ రైలు వేగంగా రాజధాని ఎక్స్ ప్రెస్ (Rajdhani Express) కంటే 40 శాతం అధికంగా ఉంటుందని చెప్పారు.