సాధారణ వ్యక్తిలా లారీలో కూర్చుని దాదాపు 50 రిలో మీటర్ల మేర ప్రయాణం చేశారు. ఇది అసలైన మన్ కీ బాత్ అని చెబుతూ ఈ యాత్ర చేపట్టారు. అనంతరం అంబాలాలో లారీ డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు.
సెక్స్ వర్కర్ల(Sex Workers)కు కూడా చట్ట ప్రకారంగా గౌరవం, సమాన రక్షణ ఉంటుందని కోర్టు తెలిపింది. వారి ఇష్టానుసారంగా వేశ్యగా మారడం చట్టవిరుద్దం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు(Mumbai High Court) తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఒక్కసారిగా వరద పోటెత్తడంతో దుకాణం మూసేయడానికి కూడా అవకాశం లభించలేదు. వరద దుకాణంలోకి పోటెత్తడంతో బంగారు, వజ్రాభరణాలు, డబ్బు నీటిలో కలిసిపోయాయి. నగలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) CSE 2022 పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను అధికారులు ప్రకటించారు. మే 23, 2023న తన అధికారిక వెబ్‌సైట్ లో రిలీజ్ చేశారు.
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడి(Rs 2000 note exchange) ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియను కొంత సులభతరం చేయడానికి బ్యాంకులు రూ. 2000 కరెన్సీ నోట్లను చిన్న డినామినేషన్‌లకు మార్చుకోవడానికి ప్రత్యేక కౌంటర్లను కేటాయించాయి. 2000 రూపాయల కరెన్సీ నోట్లను మార్చుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
భారత్ నుంచి దిగుమతి చేసుకున్న దగ్గు మందు సేవించి పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారత్ లో తయారైన కలుషిత దగ్గు మందు తాగడంతో పదుల సంఖ్యలో చిన్నారులు మరణించారు.
అభూత కల్పనను వాస్తవ కథగా చిత్రీకరించి ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు రేకిత్తించేలా తీసిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ సినిమాకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలికి జనాలను చూసేలా ప్రోత్సాహం కల్పించడం తీవ్ర దుమారం రేపింది.
ప్రధాని మోదీని, భారత న్యాయ వ్యవస్థను కించపరిచేలా తప్పుడు ఆరోపణలు డాక్యుమెంటరీలో చేశారని ఆరోపించింది. ప్రధాని మోదీ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. దీనికి నష్ట పరిహారంగా బీబీసీ రూ.10 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది.
తాగి పెళ్లి పీటలెక్కిన వరుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వధువు అతడిని పెళ్లి(marriage) చేసుకోవడానికి నిరాకరించింది. ఆ తర్వాత పంచాయతీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది. ఈ సంఘటన ఇటీవల వారణాసిలోని హర్హువాలో చోటుచేసుకుంది.
ముంబై-నాగ్‌పూర్ రహదారిపై ఉదయం 7 గంటలకు ఘోర ప్రమాదం(accident) జరిగింది. ఒక బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించగా(Seven dead)..మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సింధ్‌ఖేదరాజా ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పూణె నుంచి బుల్దానాలోని మెహెకర్‌కు వెళ్తున్న బస్సు(bus) ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్క...
ప్రపంచ అథ్లెటిక్స్ విడుదల చేసిన తాజా ర్యాకింగ్స్‌లో 1455 పాయింట్లతో నీరజ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకూ వరల్డ్ చాంపియన్ గా ఉన్న అండర్సన్ పీటర్స్‌ను వెనక్కి నెట్టి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు.
అన్ని కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ లను పెట్టుకుంటారు . దాని కోసం దాదాపు అందరూ సెలబ్రెటీలనే ఎంచుకుంటారు. వారు అయితే, తమ కంపెనీకి పేరు వస్తుందని వారు భావిస్తుంటారు.. అయితే ఇప్పుడు 'ది యువతీ కలెక్షన్' అనే లగ్జరీ బ్రాండ్ ఇప్పుడు మురికివాడలో పెరిగిన ఓ అమ్మాయికి మోడల్‌గా మారే అవకాశాన్ని కల్పించింది. 14 ఏళ్ల బాలే అందులో విజయం సాధించింది. ఆమె మలిషా ఖర్వా, ఒక లగ్జరీ బ్యూటీ బ్రాండ్ కోసం ఎన్నికైన బాలిక.
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడని వారు చాలా అరుదు అని చెప్పొచ్చు.వారు చేసే ఉద్యోగం, వారికి వచ్చే జీతాన్ని బట్టి క్రెడిట్ కార్డు లిమిట్ ఆధారపడి ఉంటుది. అయితే..క్రెడిట్ కార్డులు ఉద్యోగస్తులకే కాదు సామాన్యులకు కూడా చాలా అవసరం. అధికారికంగా జీతం ఖాతా ఉన్నవారే కాకుండా బ్యాంకు ఖాతా లేనివారు కూడా క్రెడిట్ కార్డును పొందవచ్చు. ఇంట్లో పనిచేసే గృహిణి కూడా క్రెడిట్ కార్డు పొందవచ్చు. అటువంటి వ్యక్తులు క్రెడిట...