ముంబై-నాగ్పూర్ రహదారిపై ఉదయం 7 గంటలకు ఘోర ప్రమాదం(accident) జరిగింది. ఒక బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించగా(Seven dead)..మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సింధ్ఖేదరాజా ఆసుపత్రికి తరలించారు.
మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పూణె నుంచి బుల్దానాలోని మెహెకర్కు వెళ్తున్న బస్సు(bus) ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాజిస్టిక్ సంస్థ ట్రక్కు ముందు భాగం స్వల్పంగా ధ్వంసం కాగా.. బస్సు అంతకుమించి దాదాపు సగం కంటే ఎక్కువగా ధ్వంసమైంది.
మరో ఘటనలో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వేగంగా వస్తున్న ట్రక్కు.. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV)ని ఢీకొనడంతో కనీసం ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారని మంగళవారం ఒక అధికారి తెలిపారు. ముంబైకి దాదాపు 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిలోని ఖల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్యాపూర్-అంజంగావ్ రోడ్డులో సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు.