»Rs 2000 Note Exchange Begins Today March 23th September 30th 2023
Rs2000 note exchange: ఈ రోజు నుంచి రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు..!
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడి(Rs 2000 note exchange) ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియను కొంత సులభతరం చేయడానికి బ్యాంకులు రూ. 2000 కరెన్సీ నోట్లను చిన్న డినామినేషన్లకు మార్చుకోవడానికి ప్రత్యేక కౌంటర్లను కేటాయించాయి. 2000 రూపాయల కరెన్సీ నోట్లను మార్చుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
కొన్నాళ్ల క్రితం చలామణిలో ఉన్న రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఆ నిర్ణయం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఆ స్థానంలో కొత్త రూ.500 నోటు, రూ.రెండు వేల నోటు తీసుకువచ్చారు. అయితే, తాజాగా ఈ రూ.2 వేల నోటుపై ఆర్బీఐ(RBI) షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. రూ.2 వేల నోట్లు కలిగిన వారు సెప్టెంబర్ 30లోపు మార్చుకోవాలని సూచించింది. బ్యాంకులకు వెళ్లి ప్రజలు వారి వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను (2000) మార్చుకోవచ్చు(Rs 2000 note exchange). లేదంటే బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. దగ్గరిలోని ఏ బ్యాంక్‌కు (Bank) వెళ్లైనా సరే రూ.2 వేల నోట్లను మార్చుకునే వెసులుబాటు ఉంది. ఈ రోజు నుంచి రూ.2 వేల నోటును బ్యాంకులో మార్చుకునే సదుపాయాన్ని కల్పించారు. అదే విధంగా ఈ నోట్ల రద్దు విషయంలో ప్రజలకు వస్తున్న కొన్ని అనుమానాలను సైతం నివృత్తి చేయడానికి ఆర్బీఐ గవర్నర్ ప్రయత్నించారు.
సెప్టెంబరు 30 వరకు నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చినా ఆ తర్వాత ఆ నోటు చెల్లుబాటు కాదని తాము ఎక్కడా చెప్పలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కాకపోతే ఆ తేదీలోపు మార్చుకోవాలని మాత్రమే పేర్కొన్నట్టు తెలిపారు. గడువు పెట్టకపోతే నోట్ల మార్పిడి నిదానంగా సాగుతుందని, అందుకనే సెప్టెంబరు 30 వరకు విధించినట్టు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ఏం చేయాలన్న దానిపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
అదే విధంగా మళ్లీ రూ.వెయ్యి నోటు(rs.100 note) మార్కెట్ లోకి వస్తుందని ప్రచారం మొదలైంది. ఆ రూమర్స్ ని కూడా ఆయన కొట్టిపారేశారు. రూ.1000 నోటును మళ్లీ తీసుకొచ్చే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో దాని గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని పేర్కొన్నారు.