»Case Filed On Petrol Bunk Staff Refused Rs 2000 Note In Delhi
Banned Rs.2000 Note తీసుకోనన్న పెట్రోల్ బంక్ సిబ్బంది.. కేసు నమోదు
సెప్టెంబర్ నెల వరకు చెల్లుబాటు అవుతుందని వివరించాడు. అయినా అక్కడి సిబ్బంది వినిపించుకోకపోవడంతో కొంత వాగ్వాదం ఏర్పడింది. దీంతో వెంటనే బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
రద్దు చేసిన రూ.2 వేల నోటుపై ఇంకా గందరగోళం (Confusion) నెలకొని ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం (Govt of India), ఆర్బీఐ (RBI) స్పష్టమైన ప్రకటన చేసినా అవగాహన కల్పించడంలో విఫలమైంది. దీంతో ప్రజలు (Public) తమ వద్ద ఉన్న పెద్ద నోటును విడిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈ సమయంలో పెట్రోల్ బంక్ (Petrol Bunk)కు వెళ్తున్నారు. అక్కడ సిబ్బంది నిరాకరిస్తున్నారు. అలాగే ఓ వ్యక్తి నిరాకరిస్తే (Refuse) బంకు యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఢిల్లీలో (Delhi) చోటుచేసుకుంది.
ఢిల్లీలోని సౌత్ ఎక్స్ టెన్షన్ (South Extension) పార్ట్-1లోని పెట్రోల్ బంక్ లో ఓ వ్యక్తి రూ.400 పెట్రోల్ (Petrol) పోసుకున్నాడు. అనంతరం రూ.2 వేల నోటు (Rs 2000 Note) ఇవ్వగా అక్కడి అటెండర్ ఆ నోటు తిరస్కరించాడు. తీసుకోలేనని చెప్పాడు. ఎలా తీసుకోవని.. ఈ నోటు సెప్టెంబర్ (September) నెల వరకు చెల్లుబాటు అవుతుందని వివరించాడు. అయినా అక్కడి సిబ్బంది వినిపించుకోకపోవడంతో కొంత వాగ్వాదం (Quarrel) ఏర్పడింది. దీంతో వెంటనే కోట్ల పోలీస్ స్టేషన్ (Kotla Police Station)లో బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ (Investigation) మొదలుపెట్టారు.
విచారణ చేయగా.. పెట్రోల్ బంక్ నిర్వాహకులు తమ బాధ వెళ్లబోసుకున్నారు. అందరూ రూ.2 వేల నోట్లను తీసుకుని వస్తున్నారని.. దీంతో తమ వద్ద చిల్లర సమస్య ఏర్పడిందని వాపోయారు. ఆ నోట్లు (Banned Nontes) పేరుకుపోతే తాము డిపాజిట్ చేసేందుకు ఇబ్బంది అని చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యే ఉంది. కిరాణం, మందుల దుకాణాలు, హోటళ్లు, థియేటర్లు తదితర దుకాణదారులు (Shop Keepers) రూ.2 వేల నోట్లను తిరస్కరిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అవగాహన (Awareness) కల్పించడంలో విఫలమవుతోంది. నోట్లు తిరస్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ నోట్లపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.