Rs.2000 Note : ఆర్బీఐ సంచలన నిర్ణయం..రూ.2 వేల నోటు విత్ డ్రా
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లు(Rs.2000 Note) ఉపసంహరించుకుంటున్నామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. సెప్టెంబర్ 30లోగా ఆ నోట్లను బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ వినియోగదారులకు స్పష్టం చేసింది.
Rs.2000 Note : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లు(Rs.2000 Note) ఉపసంహరించుకుంటున్నామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. సెప్టెంబర్ 30లోగా ఆ నోట్లను బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ వినియోగదారులకు స్పష్టం చేసింది. మే 23 నుంచి ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. రూ. 2 వేల నోట్లను సర్కూలేషన్‌లో ఉంచొద్దని బ్యాంక్‌లకు ఆదేశం. దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
2016లో నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంక్ రూ.2,000 నోట్లు ప్రింట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటిని సర్క్యులేషన్ నుంచి తొలగిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. అయితే వీటిని లీగల్ టెండర్‌గా ఉపయోగించవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. చాలాకాలంగా రూ.2,000 నోట్లపై అయోమయం నెలకొంది. బ్యాంకులు, ఏటీఎంలల్లో రూ.2,000 నోట్లు కనిపించట్లేదు. రూ.2,000 నోట్ల సర్క్యులేషన్ బాగా తగ్గిపోయింది. దీంతో రూ.2,000 నోట్లను రద్దు చేస్తారా అన్న సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ఇప్పుడు రూ.2,000 నోట్లపై కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ.