»Vk Naresh Gave Clarity On Marriage With Pavitra Lokesh Soon
Pavitra Naresh : ఎట్టకేలకు త్వరలోనే పవిత్ర- నరేష్ పెళ్లి క్లారిటీ వచ్చేసిందోచ్
టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ న్యూస్ ట్రెండింగ్ లో ఉందంటే అది పవిత్రలోకేష్, నరేష్ బంధం గురించే. నరేష్, పవిత్ర లోకేష్ వీరిద్దరికి సంబంధించి రోజుకో కొత్త న్యూస్ వినిపిస్తోంది. వీరిద్దరి లేషన్లో ఉన్నారంటూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
Pavitra Naresh : టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ న్యూస్ ట్రెండింగ్(Trending News) లో ఉందంటే అది పవిత్ర లోకేష్(Pavitra lokesh), నరేష్(Naresh) బంధం గురించే. నరేష్, పవిత్ర లోకేష్ వీరిద్దరికి సంబంధించి రోజుకో కొత్త న్యూస్(News) వినిపిస్తోంది. వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ త్వరలోనే వివాహం(Marriage) చేసుకోబోతున్నారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి ‘మళ్ళీ పెళ్లి’(Malli pelli) అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. వారు పెళ్లి చేసుకుంటున్నట్లు చిత్రీకరించిన పెళ్లి వీడియో గతంలో ఓ సారి షేర్ చేసి జనాల్లో ఆసక్తి రేకెత్తించారు.
ప్రస్తుతం వారు నటించిన తాజా చిత్రం మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అయితే పవిత్ర లోకేష్, నరేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది.. తాజాగా మళ్లీ పెళ్లి ప్రమోషన్స్(promotions) లో వీకే నరేష్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకుంటానని తెలిపారు. వాస్తవానికి పెళ్లి అనేది అంత ఖచ్చితంగా అవసరం లేదు .. చాలామంది ఇష్టం లేకుండా సమాజం కోసం పెళ్లి అనే బంధం లో ఉంటున్నారు. అలాంటి వారి కోసమే ఇలాంటివన్నీ అంటూ బాంబు పేల్చారు.. అలాగే నాకు పవిత్రకు ఇంకా వివాహం కాలేదు కానీ మా మనసులు కలిశాయి అందుకే కలిసే ఉంటున్నాము త్వరలోనే పవిత్రను వివాహం చేసుకుంటానంటూ నరేష్ తెలియజేశారు. ఈ ఏడాదైనా నరేష్ పవిత్ర లోకేష్ వివాహ బంధంతో ఒక్కటవుతారేమో చూడాలి మరి.