»Bride Calls Off Marriage In Varanasi Up Because Of Alcohol
Marriage off: రెండు నిమిషాల ముందు పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..!
తాగి పెళ్లి పీటలెక్కిన వరుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వధువు అతడిని పెళ్లి(marriage) చేసుకోవడానికి నిరాకరించింది. ఆ తర్వాత పంచాయతీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది. ఈ సంఘటన ఇటీవల వారణాసిలోని హర్హువాలో చోటుచేసుకుంది.
పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులు, సన్నిహితులు అందరూ పెళ్లికి హాజరయ్యారు. వధూవరులు కూడా మండపానికి చేరుకున్నారు. మరో రెండు నిమిషాల్లో పెళ్లి అనగా వధువు ఆ పెళ్లిని ఆపేసింది. దీంతో వరుడితో సహా పెళ్లి(marriage)కి వచ్చిన వారంతా కూడా షాకయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలో చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి జన్సా స్టేషన్ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం వీరి పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కొడుకు ఊరేగింపుగా మండపానికి చేరుకున్నాడు. వరుడి వెంట అతని స్నేహితులు కూడా ఉన్నారు. వారంతా మద్యం(alcohol) సేవించి, వధువు బంధువులు, స్నేహితులను చూసి చీప్ గా మాట్లాడటం, కామెంట్ చేయడం చేశారట.
అవి కాస్త వధువు చెవిన పడ్డాయి. ఆ తర్వాత వధువు(bride)కి వరుడు కూడా మద్యం సేవించి మండపానికి వచ్చాడేమో అనే అనుమానం కలిగింది. తీరా దండలు మార్చుకుంటుంటే..మద్యం తాగాడని ఆమెకు అర్థమైంది. అంతే, అక్కడికక్కడ ఆమె పెళ్లి ఆపేసింది. ఆమె చేసిన పనికి అందరూ షాకయ్యారు. పెళ్లి రోజు కూడా మందు తాగడం ఆమెకు నచ్చలేదనే విషయం అర్థమైంది. చాలా మంది ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. చివరకు పెళ్లి ఆగిపోయింది.