»3 Killed In Firecracker Factory Explosion In South 24 Parganas District
West Bengal : పశ్చిమ బెంగాల్ లో బాణా సంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురి మృతి
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని చింగ్రిపోటాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
West Bengal : పశ్చిమ బెంగాల్(West Bengal)లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని చింగ్రిపోటాలో బాణసంచా ఫ్యాక్టరీ(Fire Craker Factory)లో పేలుడు సంభవించి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు(Blast) సమాచారం అందిన వెంటనే పోలీసులు(police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలం నుంచి అందిన సమాచారం ప్రకారం మృతుల్లో ఇద్దరు తల్లీకూతుళ్లు ఉన్నారు. వీరి పేర్లు జయశ్రీ ఘంటి, పంప ఘంటి. చనిపోయిన మూడో వ్యక్తి పేరు యమునా దాస్.
జిల్లాలోని చింగ్రిపోత(Chingripota) ప్రాంతం బాణాసంచా పరిశ్రమకు ప్రసిద్ధి. బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం పేలుడు సంభవించింది. ఆ బాణసంచా ఫ్యాక్టరీని అక్రమంగా నడుపుతున్నారు. దక్షిణ 24 పరగణాల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అక్రమ పటాకుల ఫ్యాక్టరీలు ఉన్నాయి.
ఇంతకు ముందు కూడా..
ఇంతకు ముందు కూడా 2021లో అభయ్ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జరిగింది. అందులో 3 మందికి పైగా మరణించారు. ఆదివారం అక్రమ పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
గత వారం 12 మంది చనిపోయారు
వారం క్రితం (మే 16) తూర్పు మేదినీపూర్ జిల్లాలోని ఎగ్రా వద్ద అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్రమ పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భవనం మొత్తం నేలమట్టమైంది. ఈ అక్రమ పటాకుల ఫ్యాక్టరీ నివాస ప్రాంతంలో ఉంది.
బాధితులకు సీఎం పరిహారం
ఎగ్రాలోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో బాంబు పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారణకు ఆదేశించారు. దీంతో పాటు మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. క్షతగాత్రులకు లక్ష ఇస్తామని ప్రకటించారు. అదే సమయంలో క్షతగాత్రులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారు.