»Rain In Hyderabad Some Areas Roads Difficulties In Journey
Rain in Hyderabad: హైదరాబాద్లో వర్షం..రాకపోకలకు ఇబ్బందులు!
హైదరాబాద్ (Hyderabad)లో తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (heavy rain) కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
అకాల వర్షాలు (Untimely Rains) తెలుగు రాష్ట్రాలను(Telangana) చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad)తోపాటు పలు ప్రాంతాల్లో తెల్లవారు జాము నుంచే వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు (Lowest Places) నీరు చేరింది. పలుచోట్ల డ్రైనేజీలు (Drainages) మూసుకుపోయాయి. కొన్నిప్రాంతల్లో నాళాల నీరు వరదలా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాహనదారులు రోడ్లపై ప్రయాణించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, లక్డీకాపూల్, కోఠి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బాలానగర్, అఫ్జల్ గంజ్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. కాగా వర్షం వలన పలుచోట్ల విద్యుత్ సరఫరాకు (Power Cuts) అంతరాయం ఏర్పడింది.
తెల్లవారుజామున వర్షం రావడంతో పేపర్ వేసేవాళ్లు (Paper Boys), పాలవారు (Milkmans), పారిశుద్ధ్య సిబ్బంది (Sanitary Staff) పనులకు ఆటంకం ఏర్పడింది.
మరోవైపు తెలంగాణతోపాటు ఏపీలో కూడా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.