హైదరాబాద్ లోని అమీర్ పేట (Ameerpet) సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ మల్టీప్లెక్స్‌ని మంత్రి తలసాని(Minister Talasani) శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ (Allu Arjun) ఏఏఏ సినిమాస్ కు ప్రారంభించారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగిన విషయం తెలిసిందే. జూన్ 16న ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్(Adipurush)’ విడుదల కానుండగా.. ఈ థియేటర్లో స్క్రీనింగ్ అయ్యే తొలి సినిమాగా నిలవనుంది. ఈ గ్రాండ్ మల్టీప్లెక్స్ (Multiplex) అత్యాధునిక హంగులతో నిర్మించారు.
ఈ మల్టీప్లెక్స్ లో అనేక ప్రత్యేకతలున్నాయి. సీటింగ్, సౌండ్ సిస్టం, స్క్రీన్స్ వేటికవే ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తం 5 స్క్రీన్లున్నాయి. మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తు ఉండబోతోంది. ఇందులోనే బార్కో లేజర్ ప్రొజెక్టర్ (Laser projector), అట్మాస్ సౌండ్ వంటి వరల్డ్ క్లాస్ ఫీచర్లు యాడ్ చేశారు. స్క్రీన్ 2లో ఎపిక్ లక్సాన్ స్క్రీన్ ఉంది. ఇది కూడా అట్మాస్ సౌండ్ సిస్టంతోనే రాబోతోంది. మిగతా స్క్రీన్లన్నీ 4కే ప్రొజెక్షన్ తో ఏర్పాటు చేయబడ్డాయి. డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ వీటిల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్(Allu Arvind),ఏషియన్ సినిమాస్ భాగస్వాములు కూడా పాల్గొన్నారు.