రుణాలు చెల్లించిన వారి పత్రాలను కొన్ని బ్యాంకులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంటాయి. దీనిపై ఆర్బీఐకి పలు ఫిర్యాదులు అందడంతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ రూల్స్ జనవరి 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి.
ముంబై విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి జారిపోయింది. విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
రెండో విడత పన్ను చెల్లించేందుకు ఆర్థిక శాఖ సెప్టెంబర్ 15వ తేది వరకూ గడువు ఇచ్చింది. ఆ గడువు రేపటితో ముగియనుంది. ఒకవేళ ఎవరైనా గడువులోగా పన్ను చెల్లించకుంటే వారికి జరిమానాను విధించనున్నట్లు వెల్లడించింది.
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తరువాత దేశవ్యాప్తంగా ఎలాంటి పరిణమాలు చోటుచేసుకున్నాయో చూస్తూనే ఉన్నాము. దీనిపై ఎవరూ మాట్లాడొద్దని సీఎం స్టాలిన్ ఆదేశించారు. మోడీకి భయపడే ఈ నిర్ణయం తీసుకున్నారా అని రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది.
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్(Nipah virus) కేసులు చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య ఐదుకి చేరుకుంది. మరోవైపు కంటాక్ట్ లిస్ట్ కూడా పెరిగిందని, మరికొంత మంది హైరిస్క్ కేటగిరిలో ఉన్నారని వైద్యాధికారులు ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్లోని(Jammu and Kashmir) అనంత్‌నాగ్(anantnag district)లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో(encounter) ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులు, ఒక పోలీసు అధికారి మరణించారు.