భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆ ల్యాండర్‌ను ప్రయోగించినప్పుడు ల్యాండింగ్ వీడియోకు 80 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. దీంతో యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్ (Youtube Chief Neel Mohan) ఇస్రోను అభినందించారు. లైవ్ స్ట్రీమింగ్‌లో ఇస్రో రికార్డు (Live streaming Record) నెలకొల్పిందన్నారు.
This was so exciting to watch – congratulations to the whole team at @isro. 8M concurrent viewers is incredible! https://t.co/PM3MJgkPrE
చంద్రయాన్-3 (Chandrayaan-3) మూన్ ల్యాండింగ్ చూడటానికి అందరూ ఉత్సాహం చూపారని, ఆ వీడియోకు ఏక కాలంలో 8 మిలియన్ వ్యూస్ రావడం అద్భుతమన్నారు. ఇస్రో (ISRO) బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే యూట్యూబ్ (Youtube) ఇండియా పాత పోస్ట్‌ను కూడా అందులో యాడ్ చేశారు.