»Encounter In Jammu And Kashmir Anantnag District Two Army Officers And One Police Officer Killed
Three killed: జమ్మూ కశ్మీర్లో ఎదురుకాల్పులు..ముగ్గురు జవాన్లు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని(Jammu and Kashmir) అనంత్‌నాగ్(anantnag district)లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో(encounter) ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులు, ఒక పోలీసు అధికారి మరణించారు.
encounter in Jammu and Kashmir anantnag district two army officers and one police officer killed
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని అనంత్‌నాగ్ జిల్లా(anantnag district)లో బుధవారం సాయంత్రం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్(encounter)లో భారత ఆర్మీ కల్నల్, ఒక మేజర్, ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్నాగ్ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని వెతకడానికి ఆర్మీ అధికారులు వెళ్లారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఉగ్రవాదులు ఆర్మీ అధికారులపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో జవాన్లు కూడా ధీటుగా ఎదురుకాల్పులు చేశారు. కానీ ఆ క్రమంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్ ఆపరేషషన్లో భద్రతా దళాలు పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి, పాకిస్తాన్ ఆధారిత పలు వస్తువులను స్వాధీనం చేస్తున్నారని అధికారులు తెలిపారు.
అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన జవాన్లకు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(manoj sinha) నివాళులర్పించారు. వీరి నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. అమరవీరుల కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆ ధైర్యవంతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.