బీహార్(Bihar)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్పుర్ జిల్లాలో 34 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ గురువారం ఉదయం భాగమతి నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికిపైగా చిన్నారులు గల్లంతయ్యారు. పొరుగు గ్రామంలో ఉన్న పాఠశాలకు విద్యార్థులు పడవలో వెళ్తుండగా ఈ దుర్ఘటన (Accident) జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 34 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం విషయం తెలియగానే స్థానికులు నాటు పడవలతో సహాయక చర్యలు చేపట్టి కొంతమంది చిన్నారులను ఒడ్డుకు చేర్చారు.సమాచారమందుకున్న పోలీసులు (Police), సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ఇప్పటి వరకు మొత్తంగా 18 మంది విద్యార్థులను కాపాడగా.. మరో 14 మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముజఫర్పుర్ (Muzaffarpur) పర్యటనలోనే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 22 మందిని సురక్షితంగా రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రి(hospital)కి తరలించారు. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపడుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు.
The boat carrying children going to school capsized in Muzaffarpur.. About 34 children were on board the boat. Many children were reported missing. Police reached the spot and NDRF is being called.#Bihar#India#Muzaffarpur#Boatcapsized… pic.twitter.com/U4E2rsrPJ8