రీబ్రాండింగ్‌లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త లుక్ ఆవిష్కరించారు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల తన తల్లి సోనియా గాంధీకి కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చారు. ఈ కుక్కపిల్లకి నూరి అని పేరు పెట్టారు. ఈ కుక్కపిల్ల పేరుపై వివాదం నెలకొంది.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి కొత్త పూజారి మహేష్ పీ.ఎన్‌నుని నియమించారు.
దసరా పండగకు కేంద్రం ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. 6 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది.
సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్, అతని భార్య, కుమారుడికి కోర్టు షాక్ ఇచ్చింది. ఫేక్ సర్టిఫికెట్ల కేసులో ఒక్కొక్కరికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్క నెలలోనే అజమ్ ఖాన్ 4 కేసుల్లో దోషిగా తేలాడు. మరోవైపు అతని కుమారుడు రెండు కేసుల్లో దోషిగా ఉన్నాడు.
దేశంలో కరెంట్ రేట్లు పెరగిపోవడడానికి ముఖ్య కారణం అదానీ గ్రూప్ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోడి ఇచ్చే ధైర్యంతోనే అదానీ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నాడని వ్యాఖ్యనించారు. ఇలాంటి లూటీ మరేదేశంలో జరిగినా కూడా ఈ పాటికే అక్కడి ప్రభుత్వం కూలిపోయి ఉండేదని ఆరోపించారు.
కేంద్రం తాజా నిర్ణయంతో ఉద్యోగుల డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి చేరనుంది.
రాజ్‌కోట్‌లో మహిళలు బైకులు, కార్లపై గర్భా డ్యాన్స్ చేశారు.
యూపీలో ప్రస్తుతం ఎన్నికలు లేనప్పటికీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు శుభవార్త తెలిపారు.
దసరా పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లను నడపనుంది. అక్టోబర్ 20వ తేది నుంచి 29వ తేది వరకూ దాదాపు 620 ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
శివసేన ఉద్ధవ్ వర్గం, షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసు విచారణలో జాప్యంపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు మందలించింది. అనర్హత కేసు విచారణను పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ను చెప్పాలని గతంలోనే అసెంబ్లీ స్పీకర్‌ను కోరామని... అయితే ఇంతవరకు చెప్పలేదని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. క్వాష్ పిటిషన్ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఇటు జైలులో న్యాయవాదుల ములాఖత్‌ను కూడా జైలు అధికారులు తగ్గించారు.
చంద్రుని మీదకు మనుషులను పంపే విషయంపై నేడు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధాని మోదీతో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2035లో భారతీయ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. 2040లో చంద్రునిపైకి భారత వ్యోమగామిని పంపనున్నట్లు తెలిపారు.
దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలను పన్నుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
సాధారణంగా మనదేశంలో అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ యూరప్ ఖండంలోని ఓ దేశంలో ఆరునెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇంతకీ ఆ దేశం పేరేంటి? వివరాలు తెలుసుకుందాం.