»Isros Key Announcement Space Station In 2035 Indian Astronaut On The Moon In 2040
ISRO: ఇస్రో కీలక ప్రకటన..2035లో స్పేస్ స్టేషన్, 2040లో చంద్రుడిపైకి భారత వ్యోమగామి
చంద్రుని మీదకు మనుషులను పంపే విషయంపై నేడు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధాని మోదీతో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2035లో భారతీయ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. 2040లో చంద్రునిపైకి భారత వ్యోమగామిని పంపనున్నట్లు తెలిపారు.
చంద్రయాన్-3 (Chandrayan-3) విజయవంతం తర్వాత ఇస్రో (ISRO) అదే జోష్‌తో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధమైంది. భారత వ్యోమగామిని 2040లోగా చంద్రునిపైకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంపై ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. 2035లోగా భారతీయ స్పేస్ స్టేషన్ (Indian Space Station)ను నిర్మించాలని ప్రధాని మోదీని ఇస్రో శాస్త్రవేత్తలు కోరినట్లుగా ప్రకటనలో వెల్లడించారు.
VIDEO | PM Modi chaired a high-level meeting to assess progress of India’s Gaganyaan Mission and to outline the future of India’s space exploration endeavours earlier today.
The Department of Space presented a comprehensive overview of the Gaganyaan Mission, including various… pic.twitter.com/Q2fBqPvoS2
గగన్‌యాన్ (Gaganyan)పై నేడు రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. అక్టోబర్ 21వ తేదిన ఉదయం 7 గంటలకు శ్రీహరికోట నుంచి గగన్‌యాన్ మిషన్ మాడ్యూల్‌ను పరీక్షించనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో చేపట్టే రోదసి కార్యక్రమాల గురించి ప్రధాని మోదీ ఈ సమావేశంలో ఇస్రో సైంటిస్టులకు (Isro Scientists) పలు సూచనలు చేశారు.
వీనస్ ఆర్బిటార్ మిషన్, మార్స్ ల్యాండర్ గురించి ఈ సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 2035లో భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయాలని, 2040లో చంద్రుని మీదకు భారతీయ వ్యక్తిని పంపాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణను అంతరిక్ష శాఖ డెవలప్ చేయాలని ప్రధాని మోదీ (Pm Modi) దిశానిర్దేశం చేశారు.