దేవీ నవ రాత్రుల సందర్బంగా గుజరాత్(Gujarat), రాజస్థాన్ రాష్ట్రల్లోని పలు ప్రాంతల్లో ప్రజలు ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నారు.నవరాత్రి ఉత్సవల మూడోరోజున గుజరాత్ రాజ్‌కోట్(Rajkot)లో మహిళలు చేసిన గర్బా డ్యాన్స్ అద్భుతంగా కన్నుల పండుగ ఉంది. కొంత మంది మహిళలు బైకులు, కార్లపై ఈ గర్భా డ్యాన్స్(Garbha dance) చేశారు. ముందుగా బుల్లెట్ బైక్ నడుపుతూ ఒక మహిళ, ఆ తర్వాత ఓపెన్ టాప్ కారు నడుపుతూ మరో మహిళ గర్బా డ్యాన్స్‌తో కనువిందు చేశారు.
ఆ తర్వాత స్కూటీలపై ఒక్కో మహిళ కారు నడుపుతుండగా, వెనుక సీట్లపై ఒక్కో మహిళ నిలబడి గర్బా డ్యాన్స్ చేశారు. అనంతరం ఓ మహిళ ఓపెన్ టాప్ కారు నడుపుతుండగా పలువురు మహిళలు (Women) ఆ కారుపై నిలబడి గర్బా నృత్యాన్ని ప్రదర్శించారు.ఈ వీడియోను సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే 60 వేల మంది వీక్షించారు. అదేవిధంగా సదరు మహిళలను ప్రశంసిస్తూ నెటిజన్లు (Netizens) లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.