Skill Scamలో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్.. జైలులో ములాఖత్ కుదింపు
చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. క్వాష్ పిటిషన్ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఇటు జైలులో న్యాయవాదుల ములాఖత్‌ను కూడా జైలు అధికారులు తగ్గించారు.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు (Chandrababu) పేరు తొలుత ఎఫ్ఐఆర్లో లేదని.. రిమాండ్ సమయంలో చేర్చారని హరీశ్ సాల్వే తెలిపారు. 75 ఏళ్ల వయస్సు గల చంద్రబాబును గత 40 రోజులుగా జైలులో ఉంచారని పేర్కొన్నారు. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం రోజున తీర్పు ఇవ్వనుంది.
చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించక పోగా జైలులో న్యాయవాదులతో ములాఖత్‌ను భద్రత పేరుతో తగ్గించారు. ఇప్పటివరకు రోజు రెండుసార్లు చంద్రబాబును కలిసేవారు. ఇప్పుడు దానిని ఒకసారికి కుదించారు. రోజుకు ఒకసారి మాత్రమే బాబును లాయర్లు కలువాల్సి ఉంటుంది. ఇతర ఖైదీలకు ఇబ్బంది కలుగుతోందని జైలు అధికారులు చెబుతున్నారు. బాబును మరికొన్ని రోజులు జైలులో ఉంచేందుకు కుట్రపూరితంగా రెండో ములాఖత్ రద్దు చేశారని టీడీపీ మండిపడుతుంది.
స్కిల్ స్కామ్‌లో అరెస్టై చంద్రబాబు జైలులో ఉన్నారు. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసుల్లో కూడా చంద్రబాబు పేరు ఉంది. ఆ కేసుల్లో పిటిషన్లు దాఖలు చేసేందుకు మాట్లాడేందుకు న్యాయవాదులు జైలుకు రెండుసార్లు వస్తుంటారు. అలా ఉదయం, సాయంత్రం వస్తున్నారు. భద్రత కారణాలు చూపి.. ఓకేసారి కుదించడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేశారు.