దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల (Sabarimala) ఆలయం ఒకటి.హిందువులు (Hindu)అత్యంత పవిత్ర ఆలయంగా భావించే ఈ దేవస్థానంలో అయ్యప్ప స్వామి(Ayyappa Swamy)కి దైవస్వరూపంగా వెలిశారు. ఏటా ఇక్కడికి అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు(Devotees)వస్తుంటారు.వార్షిక తీర్థయాత్రకు మరి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కేరళ(Kerala)లోని శబరిమల అయ్యప్ప ఆలయం, మలికప్పురం దేవి ఆలయాలకు ప్రధాన అర్చకులను నియమించారు. మూలాల ప్రకారం.. మువాట్టుపుజా సమీపంలోని పుటిల్లత్ మనాకు చెందిన మహేష్ పీ.ఎన్(Mahesh P.N)ను అయ్యప్ప దేవాలయ ప్రధాన పూజారిగా, గురువాయూర్ సమీపంలోని అంజూర్ పూంగట్ మనాకు చెందిన పీ.జీ మురళిని మళికప్పురం దేవి ఆలయ ప్రధాన అర్చకుడిగా ఎంపిక చేశారు.
మహేశ్ పీ.ఎన్ ప్రస్తుతం త్రిసూర్‌లోని ప్రసిద్ధ పరమేకవు ఆలయ ప్రధాన అర్చకుడిగా, పీ.జీ మురళి (PG Murali) హైదరాబాద్‌లోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్నారు. ట్రావెన్ కోర్ దేవస్థాన (Travancore Devasthanam) బోర్డు షార్ట్‌లిస్ట్ చేసిన అర్చకుల ప్యానెల్ నుంచి లాట్ల డ్రా ద్వారా ప్రధాన అర్చకులను ఎంపిక చేసింది. వీరు ఏడాది కాలానికి గాను ప్రధాన అర్చకులుగా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది శబరిమల యాత్ర సీజన్ నవంబర్ 17న ప్రారంభం కానుంది.అత్యంత నియమ, నిష్టలతో కూడిన అయ్యప్ప మాల (Ayyappa Mala) ధరించిన భక్తులకు 18మెట్లు ఎక్కి ఆలయంలోని అయ్యప్పను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. లక్షలాది మంది స్వాములు వచ్చే ఈ ఆలయంలోకి వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లకు ప్రవేశం లేదు.