»Elections Are Held Twice A Year In The European Country Of San Marino
San Marino: ఆరు నెలలకు ఒకసారి ఎన్నికలు.. ఎక్కడంటే?
సాధారణంగా మనదేశంలో అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ యూరప్ ఖండంలోని ఓ దేశంలో ఆరునెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇంతకీ ఆ దేశం పేరేంటి? వివరాలు తెలుసుకుందాం.
San Marino: యూరప్ ఖండంలోని శాన్ మారినో దేశంలో ఏడాదికి రెండుసార్లు ఎన్నికలు జరుగుతాయి. ప్రపంచంలోని చిన్న దేశాల్లో శాన్ మారినో ఒకటి. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ దాదాపుగా 34వేల మంది జనాభా ఉంటారు. ఈ దేశంలో ఏడాదిలో రెండుసార్లు ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఆరు నెలలకు ఇద్దరు దేశాధినేతలను ఎన్నుకోవాలి. ఆరు నెలల తర్వాత వారి పదవీకాలం ముగిసే వరకు ఏకకాలంలో వాళ్లు సమాన అధికారాలతో సేవలందించాలి. మళ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన వెంటనే అధ్యక్షుడు మారుతుంటాడు.
ఎన్నికైన దేశాధినేతను ఈ దేశ ప్రజలు కెప్టెన్-రీజెంట్ అని పిలుస్తారు. గ్రేట్, జనరల్ కౌన్సిల్‌లోని 60మంది సభ్యులు కెప్టెన్ రీజెంట్‌ను ఎన్నుకుంటారు. ఇక్కడి పార్లమెంట్‌ను ఆరంగో అని అంటారు. ఈ దేశంలో బహుళ పార్టీ వ్యవస్థ ఉంది. ప్రభుత్వం కార్యనిర్వాహక అధికారాన్ని అమలు చేస్తుంది. మొదటిగా ఇక్కడ క్రీ.శ 1243లో ఎన్నికలు జరిగాయి. ఈ దేశ రాజ్యాంగం 1600వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. మొత్తం విస్తీర్ణం 61 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది ఇటలీ పొరుగు దేశం.