New York Bound Flight From Europe Forced To Make Emergency Landing Due To Extreme Turbulence
Flight Emergency Land: భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఆకాశంలో ఉన్న ఓ విమానంపై (flight) వర్ష ప్రభావం పడింది. వడగళ్లు పడటంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన రోమ్‌లో (rome) జరిగింది.
ఇటలీలో గల మిలన్ (milan) నుంచి అమెరికాలో (america) గల న్యూయార్క్‌కు జేకేఎఫ్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరింది. వర్షాలు.. వడగళ్లు పడటంతో విమానం ముందు భాగానికి హోల్ పడింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 185 నంబర్ విమానం 215 మంది ప్రయాణికులతో మిలన్ నుంచి స్టార్ట్ అయ్యింది. వాతావరణం బాగుండటంతో విమానం బయల్దేరింది. 15 నిమిషాల తర్వాత వడగళ్లు, పిడుగులతో వానలో చిక్కింది. విమానం (flight) ముందు భాగం, రెక్కలు ధ్వంసం అయ్యాయి. విమానాన్ని కంట్రోల్ చేయడం పైలట్లకు ఇబ్బందిగా మారింది. దీంతో ఫ్లైట్‌ను రోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
వాతావరణం అనుకూలించక పోవడంతో రోమ్‌లో విమానం ల్యాండ్ చేశాం. ప్రయాణికులు అందరూ ఓకే అని డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధి ఒక్కరు మీడియాకు వివరించారు. విమానం పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులు పోస్ట్ చేసిన ఫోటోల్లో విమానం ముక్కు పూర్తిగా ధ్వంసమైనట్టు ఉంది. రెండు ఇంజిన్లు, రెక్కలు వడగళ్ల వల్ల దెబ్బతిన్నాయి. వడగళ్ల వర్షంలో విమానం ఒక్కసారిగి అదుపు తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. విమానం ముక్కలైపోతుందని భయపడ్డామని ఓ ప్యాసెంజర్ తెలిపారు. రోలర్ కోస్టర్ ఎక్కినట్టు అనిపించిందని మరొకరు పేర్కొన్నారు.