»If You Use Earphone Headset On Bike In Andhra Pradesh Rs 20000 Fine
AP:లో బైక్ పై ఇయర్ ఫోన్ వాడితే రూ.20 వేలు ఫైన్
దేశవ్యాప్తంగా బైక్స్, ఆటోలు, కార్లు సహా పలు వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం చట్టవిరుద్ధమని అందరికీ తెలుసు. అయితే తాజాగా ఏపీలో బ్లూటూత్ హెడ్ సెట్స్, ఇయర్ ఫోన్స్ కూడా ప్రయాణించే సమయాల్లో వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
మనలో చాలా మందికి కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో ఫోన్లు వాడటం నిషేదమని తెలుసు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్స్ పెట్టుకుంటే ఫైన్ కట్టాల్సిందేనని ప్రకటించారు. ఎందుకంటే పలువురు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెడ్ఫోన్లను ఉపయోగిస్తున్నట్లైతే కాల్ మాట్లాడటం లేదా సాంగ్స్ వినడం ద్వారా వెనుక వైపు నుంచి వచ్చే వాహనాలు అవి చేసే హారన్ సౌండ్ వినిపించక అనేక ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా ఫోన్ మాట్లాడటంతో ఆ ప్రభావం ఇతర వాహనదారులపై పడుతుందని తెలిపారు. కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఫోన్ మాట్లాడకూడదని చెబుతున్నారు. అదే విధంగా హెల్మెట్ కింద మొబైల్ ఫోన్ పెడితే పోలీసులు ఆపి చలాన్ జారీ చేస్తారు. బ్లూటూత్ పరికరాలను ఉపయోగించడం కూడా నిషేధించబడింది. చట్టం ప్రకారం మోటార్‌సైకిల్ లేదా ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు ఏ రకమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ను ఉపయోగించడం చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో ఏపీలో డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకుంటే రూ.20,000 జరిమానా కట్టాల్సిందే. ఈ నిబంధన ఆగస్టు నెల నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ ఉపయోగించకూడదని ప్రయాణికులకు సూచించారు.