»Should Prime Minister Narendra Modi Investigate Adani Who Is Looting People Rahul Gandhi
Rahul Gandhi: ప్రజలను లూటీ చేస్తున్న ఆదానీపై విచారణ జరుపరా ?
దేశంలో కరెంట్ రేట్లు పెరగిపోవడడానికి ముఖ్య కారణం అదానీ గ్రూప్ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోడి ఇచ్చే ధైర్యంతోనే అదానీ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నాడని వ్యాఖ్యనించారు. ఇలాంటి లూటీ మరేదేశంలో జరిగినా కూడా ఈ పాటికే అక్కడి ప్రభుత్వం కూలిపోయి ఉండేదని ఆరోపించారు.
Should Prime Minister Narendra Modi investigate Adani who is looting people? Rahul Gandhi
Rahul Gandhi: భారతదేశంలో పెరుగుతున్న బొగ్గు(Coal) ధరల గురించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)మరోసారి ప్రశ్నించారు. అధిక విద్యుత్ బిల్లులతో దేశ ప్రజలను అదానీ లూటీ చేశారని ఆరోపించారు. అదానీ(Adani) గ్రూప్ బొగ్గు దిగుమతులపై ఓవర్ ఇన్వాయిస్ చేయడం వల్లనే విద్యుత్ బిల్లులు పెరిగాయని దేశ పౌరులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇంతకుముందు రూ.20,000 కోట్లుగా ఉందని తాము పేర్కొన్నామని, అది మరో రూ.12,000 కోట్లు పెరిగి ఇప్పుడు మొత్తం రూ.32,000 కోట్లు అయిందని చెప్పారు. లండన్‌లోని ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని చూపిస్తూ.. అది పెరుగుతున్న బొగ్గు ధరలు, దాని వల్ల పెరిగిన కరెంట్ ఛార్జీల్లో మార్పుల గురించి చెబుతుందన్నారు.
ఇంత నేరుగా కరెంటు బిల్లులతో ప్రజలను దోచుకుంటుంటే జాతీయ మీడియా ఏది కూడా మాట్లాడలేదని, ఇలాంటి పరిణామాలు దేశంలో ఎక్కడ జరిగినా ప్రభుత్వాలు కూలిపోయి ఉండేవని రాహుల్ గాంధీ అన్నారు. ఇది కచ్చితంగా ప్రధాన మంత్రికి తెలుసన్నారు. లండన్‌లోని ఫైనాన్షియల్ టైమ్స్‌కు తెలిసినప్పుడు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కు ఎందుకు తెలియదని ప్రశ్నించారు. అదానీ గ్రూప్‌కు ప్రభుత్వం దగ్గర అత్యున్నత స్థాయిలో రక్షణ ఉందని స్పష్టంగా తెలుస్తుందన్నారు. కర్నాటక ప్రభుత్వం జారీ చేసిన విద్యుత్ సబ్సిడీ గురించి మాట్లాడుతూ.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని, మధ్యప్రదేశ్‌లో అదే విధమైన సబ్సిడీని వాగ్దానం చేసింది. ఇప్పుడు ఎక్కువ ఇన్వాయిస్ చేయడం వల్ల విద్యుత్ బిల్లులు పెరిగాయని స్పష్టమైంది. ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు అదానీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు విచారణ చేయలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.