ఎయిర్ ఇండియా (Air India) ఎక్స్‌ప్రెస్ రాబోయే 15 నెలల్లో కొత్త డిజైన్, చిహ్నాలు ఉన్న 50 బోయింగ్ 737 విమానాలను సంస్థ అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడేళ్లల్లో 170 నారో బాడీ విమానాలు కలిగిన సంస్థగా ఎదగాలని ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇటీవలే ఎయిర్ ఇండియా కొత్త లోగోను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. రీబ్రాండింగ్(Rebranding)లో భాగంగా ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన కొత్త లుక్ (New look)ను ప్రజల ముందుంచింది.మునుపటి డిజైన్‌కు భిన్నంగా కొత్త చిహ్నాలతో (లివరీ) మెరిసిపోతున్న బోయింగ్-737 విమానం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ (CEO Alok Singh) ఆవిష్కరించారు. ఇది కేవలం కొత్త బ్రాండ్ డిజైన్ కాదని, తాము ఎవరో, తమ విజన్ ఏంటో ఈ మార్పులతో చెప్పదలుచుకున్నామని సంస్థ సీఈఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ ఇకపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త తరానికి చెందిన ఎయిర్‌లైన్స్(Airlines)గా నిలుస్తుందన్నారు.