దసరా పండగ వేళ రైతులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌కు సంబంధించి గోధుమ, బార్లీతో పాటు మొత్తం 6 ప్రముఖ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం అయ్యింది. ఈ కేబినెట్ పంటల మద్దతు ధర పెంచేందుకు ఆమోదం తెలిపింది. 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి గోధుమ, బార్లీ, సన్‌ఫ్లవర్, శనగ, ఆవాలు, కంది పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ పంటలల్లో అత్యధికంగా గోధుమ పంటలకు క్వింటాలుకు రూ.150లు పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారంగా గోధుమల కనీస మద్ధతు ధరను రూ.150లు పెంచడంతో క్వింటా గోధుమల ధర రూ.2,275కు పెరిగింది. గోధుమలకు మద్దతు ధర పెంచడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
6 పంటల కనీస మద్దతు ధరలివే: 1.గోధుమలు: ఈ పంటకు కనీస మద్దతు ధర రూ.150కు పెంచడంతో క్వింటా గోధుమల ధర రూ.2,275కు చేరింది. 2.బార్లీ: ఈ పంటకు కనీస మద్దతు ధర రూ.115కు పెంచడంతో క్వింటా బార్లీ ధర రూ.1850కి పెరిగింది. 3.శెనగ: ఈ పంటకు కనీస మద్దతు ధర రూ.105 పెంచడంతో క్వింటాలు శెనగ ధర రూ.5,440కి చేరుకుంది. 4.కంది: ఈ పంటపై రూ.425ల కనీస మద్దతు ధరను పెంచడంతో క్వింటాలు రూ.6,425కు చేరింది. 5.ఆవాలు: ఈ పంటపై కనీస మద్దతు ధర రూ.200లు పెంచడంతో క్వింటాలు ధర రూ.5,650కి పెరిగింది. 6.సన్‌ఫ్లవర్: ఈ పంటపై రూ.150ల కనీస మద్దతు ధర పెంచడంతో క్వింటాలు ధర రూ. 5,800కు చేరుకుంది.