ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థుల కోసం కేంద్రం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ కార్డును తీసుకురానుంది. ఇందులో స్టూడెంట్స్ డేటాతో పాటుగా వారు సాధించిన విజయాలను నమోదు చేయనుంది. దీని వల్ల విద్యార్థులకు అనేక రకాలుగా ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
దేశవ్యాప్తంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్‌లతో ఆస్పత్రుల్లోని ICUలలో చేరిన చాలా మంది రోగులపై ఎటువంటి యాంటీబయాటిక్ ఔషధం పనిచేయడం లేదు. అలాంటి రోగులు కారణం లేకుండా చనిపోయే ప్రమాదం ఉంది అని ఎయిమ్స్ ఓ నివేదికలో వెల్లడించింది.
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలను ఇచ్చింది. అయితే మరికొన్ని హామీల పెంపుపై చర్చ జరగగా.. మాజీ సీఎం కమల్ నాథ్ 11 హామీలను ప్రస్తావించగా.. ఇప్పుడు అధికారికంగా 12 హామీలను పార్టీ ఇచ్చింది. మరి ఈ 12 హామీల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు జరుగుతుందో చూడాలి.
భారత్, పాక్ మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు జై శ్రీరాం నినాదం చేయడంపై ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది సరైన పద్దతి కాదని స్టాలిన్ ట్వీట్ చేయడంతో బీజేపీ చీఫ్ అన్నమలై ఘాటుగా రిప్లై ఇచ్చారు.
దేశంలోనే అతి చిన్న పోలింగ్ బూత్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది. షెరాదండ్ అనే గ్రామంలో కేవలం ఐదుగురి కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2008 ఎన్నికల్లో ఇక్కడ ఇద్దరు ఓటర్లు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 5కి చేరుకుంది. కేవలం 3 గుడిసెలు మాత్రమే ఆ గ్రామంలో ఉండటం విశేషం.
పది రోజుల పాటు జరిగే మైసూరు దసరా ఉత్సవాలు ఆదివారం సాంస్కృతిక నగరం చాముండి హిల్స్‌లో ప్రారంభమయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(siddaramaiah) కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ సమయంలో వేలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది.