బీహార్(Bihar)లోని బక్సర్ పట్టణంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.గూడ్సు రైలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి బక్సర్ మీదుగా ఫతుహాకు వెళ్తుండగా బక్సర్(Buxar)లోని డమరౌన్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు (Railway officials) ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టాలు తప్పిన కోచ్‌ను అక్కడి నుంచి తరలించి, రైల్వే లైన్‌ను సరిచేయడానికి సిబ్బంది కష్టపడుతున్నారు.
కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలను గురించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.ఈనెల 11న బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ (Railway station) సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. వారం తిరగక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. ఈ నెల 11న బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ (North-East Express) రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్‌పూర్ సమీపంలో ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అస్సాంలోని కామాఖ్య జంక్షన్‌కు వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్(North East Express)లోని 21 బోగీలు పట్టాలు తప్పాయి . ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు.