స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తీవ్ర ఉక్కపోత వల్ల ఆయన అలర్జీతో పాటు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులు నివేదికను విడుదల చేస్తూ వస్తున్నారు.
తాజాగా చంద్రబాబు ఆరోగ్య బులెటిన్ ను రాజమండ్రి జైలు అధికారులు రిలీజ్ చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చంద్రబాబును పరిశీలించి ఈ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. హెల్త్ బులెటిన్ లో చంద్రబాబు ఖైదీ నెంబరుతో పాటుగా ఆయనను రిమాండ్ ముద్దాయిగా తెలిపారు.
చంద్రబాబు హెల్త్ బులిటెన్: బీపీ – 130/80 శరీర ఉష్ణోగ్రత-నార్మల్ నాడి – 64/మినిట్ శ్వాస – 12/మినిట్ హార్ట్ రేట్ – ఎస్1, ఎస్2 ఆక్సిజన్ శాచ్యురేషన్-గది వాతావరణం వద్ద 96 శాతం ఊపిరితిత్తులు-క్లియర్, శారీరక క్రియాశీలత – బాగుంది బరువు – 67 కేజీలు
పై అంశాల ఆధారంగా చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్య అధికారులు తెలిపారు.