కొన్ని గంటల పాటు సాగిన ఈ భేటీ తర్వాత అయోధ్యలో నిర్మించనున్న మసీదు ఫస్ట్ లుక్ డిజైన్ వెల్లడికావచ్చని సమాచారం. అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో నిర్మించనున్న మసీదు ఎలా ఉంటుందో చిత్రాన్ని కూడా విడుదల చేయవచ్చు.
ఓ భవనంలోని కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత చెందింది. ఈ విషాద ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. అయితే చిన్నారి పడిన క్రమంలో వారి పేరెంట్స్ బయటకు వెళ్లడం విశేషం. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(modi) గురువారం ఉత్తరాఖండ్ లో ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శనం చేసుకున్నారు. దీంతోపాటు పార్వతి కుండ్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఓ కార్యక్రమం చేపట్టింది. ఆపరేషన్ అజయ్ పేరుతో నేటి నుంచి అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు తెలిపింది.
బీహార్‌లోని బక్సర్‌లోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా..మరో 50 మంది గాయపడ్డారు.
ట్రైన్లలో జర్నీ చేసే ప్రయాణికులకు IRCTC అలర్ట్ జారీ చేసింది. కొన్ని అనధికారిక ఫుడ్ డెలివరీ యాప్స్, వెబ్ సైట్లలో ఆహారాన్ని కొనుగోలు చోయోద్దని సూచించింది. అంతేకాదు అధికారిక వెబ్ సైట్లలో ఎలా ఆర్డర్ బుక్ చేయాలో కూడా తెలిపింది.
చంద్రునిపై నీటి జాడను గుర్తించి ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో మరో ప్రయోగం చేయనుంది. చంద్రయాన్-4 మిషన్‌ను జపాన్ శాస్త్రవేత్తలతో కలిసి చేపట్టేందుకు సిద్ధమైంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఆస్పత్రిలో సిబ్బంది, రోగులకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారి అసహ్యంగా ప్రవర్తించాడు. ఓ నర్సు స్నానం చేస్తుండగా పోలీసు వీడియో తీశారని నర్సు వాపోయింది. అంతేకాదు అతని ఫోన్ చూపించమని అడిగితే పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి ఏకైక మహిళా మంత్రి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి కారణాలు ఇవే అంటూ లేఖలో పేర్కొన్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం భూపేశ్ భాగల్ క్యాండీ క్రష్ ఆడుతూ కనిపించారు. దీంతో బీజేపీ తన విమర్శలకు మరింత పదును పెట్టింది.
పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట దాడిలో కీలక సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. 2016లో పఠాన్‌కోటపై జరిపిన దాడిలో భారత సైనికులు ఏడుగురు మరణించగా.. ఆరు మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో పీఎం మోడీ ఈ విషయంపై స్పందించారు. భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అయితే దీని గురించి అతని కుమార్తె నందనా దేబ్ క్లారిటీ ఇచ్చారు.
ముప్పు పెరిగిపోయిన నేపథ్యంలో దేశంలో కొత్తగా సైబర్ కమాండోస్ విభాగాన్ని కేంద్ర సర్కారు ఏర్పాటు చేయనుంది.
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదీ ముమ్మాటికీ కక్షసాధింపేనని ఆప్ నేతలు మండిపడుతున్నారు.