»Famous Economist Amartya Sen No More News Clarity Her Daughter
Amartya sen: ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ మృతిపై క్లారిటీ
నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అయితే దీని గురించి అతని కుమార్తె నందనా దేబ్ క్లారిటీ ఇచ్చారు.
famous economist amartya sen no more news clarity her daughter
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి అమర్త్య సేన్(amartya sen) మరణించారనే వార్తలను ఆయన కుమార్తె నందనా దేబ్(Nandana Deb)ఖండించారు. తన తండ్రి పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. తాము ప్రస్తుతం కేంబ్రిడ్జిలో కుటుంబ సభ్యులతో కలిసి గత రాత్రి ఆనందంగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలో తన ఫాదర్ మరణించారనే వార్తలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. అంతకుముందు సేన్ 89 ఏళ్ల వయస్సులో మరణించినట్లు అమెరికన్ చరిత్రకారుడు క్లాడియా గోల్డిన్ నకిలీ ఖాతా ఎక్స్ ద్వారా ప్రకటించింది. ఈ వార్త వెంటనే దావానంలా వ్యాపించింది. అయితే అమర్త్య సేన్ కుమార్తె నందనా దేబ్ సేన్ ధృవీకరించినట్లుగా ఇది అవాస్తవమని తేలింది.
పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్లో నవంబర్ 3, 1933న జన్మించిన సేన్ విద్యా ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో కొనసాగింది. అయితే సంక్షేమ ఆర్థిక శాస్త్రం, కరువు, పేదరికం, మానవ అభివృద్ధిపై ఆయన చేసిన కృషికి గాను సేన్‌కు 1998లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అతని పరిశోధన ఆర్థికశాస్త్రం, నైతిక పునాదులను అర్థం చేసుకోవడం, ఆర్థిక అసమానతలను పరిష్కరించడం సహా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం వంటి పలు అంశాలపై దృష్టి సారించారు.