»Low Buzz For Aadikeshava Movie Producer Nagvanshi Clarity
Aadikeshava: మూవీకి తక్కువ బజ్..నాగవంశీ క్లారిటీ
యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల యాక్ట్ చేసిన ఆదికేశవ మూవీ ఈవారం థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా..అది ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. అయితే ఈ చిత్రానికి బజ్ తక్కువగా ఉందనే అంశంపై నిర్మాత తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
Low buzz for Aadikeshava movie producer Nagvanshi Clarity
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో పంజా వైష్ణవ్ తేజ్(panja vaisshnav tej) హీరోగా యాక్ట్ చేసిన రాబోయే చిత్రం “ఆదికేశవ(Aadikeshava)” ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి తక్కువ బజ్ ఉందనే ప్రశ్నపై ఈ చిత్ర నిర్మాత నాగవంశీ(Nagvanshi)క్లారిటీ ఇచ్చారు. ఆదికేశవ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ మేరకు వెల్లడించారు. ఈ రోజు నుంచి మీరే చూస్తారు. ట్రైలర్ వచ్చింది. రెండు రోజుల్లో ఆన్లైన్ టికెటింగ్ ప్రారంభమయ్యే సమయానికి, ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించాలా వద్దా అని కూడా డిసైడ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మూవీ విడుదల నాటికి మంచి బజ్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దర్శకుడు (శ్రీకాంత్ రెడ్డి) చెన్నైలో ఫైనల్ రీ-రికార్డింగ్‌ని పరిశీలిస్తున్నారు. డేట్ సమస్యల కారణంగా శ్రీలీల ప్రమోషన్లకు రాలేకపోయిందన్నారు.
చివరి నిమిషంలో ప్రమోషన్లు తనకు చాలా సహాయపడుతున్నాయని ఈ సందర్భంగా నాగవంశీ గుర్తు చేశారు. క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా ప్రస్తుతం అందరూ డిప్రెషన్ మూడ్‌లో ఉన్నారని..వారాంతంలో రిఫ్రెష్మెంట్ కోసం ఈ చిత్రం చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఫైట్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయని..ఇదొక మాస్ చిత్రమని నిర్మాత వెల్లడించారు. వైష్ణవ్ తేజ్, శ్రీలీల(sreeleela) జంటగా నటించిన ఆదికేశవ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. మరి సితార వంశీ కాన్ఫిడెన్స్ గా చెప్పిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.