»When Will The Shooting Of Game Changer Be Complete
Ramcharan: ‘గేమ్ చేంజర్’ ప్యాకప్ అప్పుడే?
గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో.. అటు దర్శకుడు శంకర్‌కు గానీ, ఇటు నిర్మాత దిల్ రాజుకి గానీ ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతునే ఉన్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం గేమ్ చేంజర్ ప్యాకప్ అప్పుడే అని చెబుతోంది.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో.. గేమ్ చేంజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు చరణ్. ఓల్డ్ లుక్‌లో పొలిటీషియన్‌గా, యంగ్ లుక్‌లో కలెక్టర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే లీక్ అయిన చరణ్ లుక్స్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలోనే క్లారిటీ లేకుండా పోయింది.
కానీ ఎట్టకేలకు గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలోగా గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో నెక్స్ట్ ఆర్సీ 16కి రంగం సిద్ధం చేస్తున్నాడట బుచ్చిబాబు. ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చేసిన ఆర్సీ 16.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుకుంటోంది. గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోయిన వెంటనే.. ఆర్సీ 16 షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది.
వచ్చే సమ్మర్ లోపు రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేయనున్నారట. త్వరలోనే ఆర్సీ 16 సినిమాకి సంబందించిన నటీనటుల గురించి క్లారిటీ రానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా ఫైనల్ అయినట్టుగా సమాచారం. అస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈసారైనా గేమ్ చేంజర్ షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ అయి.. ఆర్సీ 16 సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి.