పార్సిల్ డెలివరీని ఓలా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో పార్సిల్ డెలివరీని ప్రారంభించింది. తర్వాత దేశంలోని మిగతా నగరాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది.
వందే భారత్ ట్రైన్లలో ప్రయాణం అంటే కొంత ఖర్చుతో కూడుకున్న పని. అయితే సామాన్యుల కోసం, అల్పాదాయ వర్గాల ప్రజల కోసం త్వరలోనే వందే సాధారణ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
చంద్రయాన్3 సక్సెస్ తర్వాత ఇస్రో గగన్‌యాన్ మిషన్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగంలోని అతి ముఖ్యమైన టెస్ట్‌ను నిర్వహించనుంది. అది సక్సెస్ అయితే గగన్‌యాన్ మరింత సులభతరం కానుంది.
కొంతమంది జీవితాల్లో కరోనా చీకట్లు చిమ్మితే.. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపింది. లాక్‌డౌన్‌లో చేసిన నిరంతర సాధన ఈ రోజు ఓ కుర్రాడిని గిన్నిస్ రికార్డు ఎక్కేలా చేసింది. పేక ముక్కలతో మేడ కట్టి గత రికార్డును బద్దలుకొట్టి గిన్నిస్ రికార్డులోకి నెక్కాడు. ఇంతకీ ఎవరు ఆ కుర్రాడో.. తెలుసుకుందాం.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha)కు షాక్ తగిలింది. తనకు కేటాయించిన టైప్-7 ప్రభుత్వ బంగ్లా వసతిని రద్దు చేస్తూ ఢీల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యసభ సెక్రటేరియట్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును రద్దు చేసింది.
ఎమ్మెల్యే టికెట్ కోసం తండ్రీకూతుర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయినప్పటికీ బీజేపీ తండ్రికే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో కూతురు కోపంతో ఊగిపోయింది. తన సోదరుడు చేసిన పని వల్ల తనకు టికెట్ రాలేదని ఆ మహిళ చెప్పుతో దాడి చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ మరోసారి కీలక ప్రకటన చేసింది.
రాహుల్ గాంధీని రావాణాసురుడిలా పోల్చుతూ బీజేపీ పోస్టర్ రిలీజ్ చేయగా.. దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ పోస్టర్ విడుదల చేసింది. ప్రధాని మోడీ అదానీ చేతిలో కీలుబొమ్మగా ఆ ఫోటోలో ఉంది.
ఓటర్లకు ఉచితాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది
బీహార్ కుల గణనపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో పాటు వచ్చే ఏడాది జనవరిలోగా సమాధానం ఇవ్వాలని బీహార్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. బీహార్ ప్రభుత్వం తన స్థాయిలో జనాభా గణనను నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రజలు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చేందుకు అవకాశం ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చేందుకు అనుమతిస్తామని చెబుతున్నారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
దేశంలో ఎన్నికలు మొదలవ్వకముందే, దాని తాలూకు సెగలు తగులుతున్నాయి. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎన్నికల సంఘం రెడీ అయిపోయింది.
ముంబైలోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే భారత్ అంతరిక్షంలో స్పేస్ సెంటర్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.
ఓ వ్యక్తి తన భార్య రెండో వివాహం చేసుకుందని కోర్టుకెక్కాడు. కేసును విచారించిన కోర్టు అతని ఫిర్యాదు తప్పని తేల్చింది. తన భార్య ఏడడుగులు వేయకపోవడం వల్ల హిందూ వివాహం జరిగినట్లు నిర్దారించలేమని కోర్టు తెలిపింది. కేసును కొట్టివేస్తూ ఆ వ్యక్తికి షాక్ ఇచ్చింది.