»Shock For Mp Raghav Chadha Delhi Court Order To Vacate The Type 7 Bungalow
MP Raghav Chadha:కు షాక్..బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశం
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha)కు షాక్ తగిలింది. తనకు కేటాయించిన టైప్-7 ప్రభుత్వ బంగ్లా వసతిని రద్దు చేస్తూ ఢీల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యసభ సెక్రటేరియట్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును రద్దు చేసింది.
Shock for MP Raghav Chadha delhi court Order to vacate the type 7 bungalow
ఢిల్లీలోని పండారా రోడ్డులో ఉన్న టైప్-7 వసతి గృహమైన ప్రభుత్వ బంగ్లాలో ఉండే హక్కు ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా(MP Raghav Chadha)కు లేదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. అలాట్మెంట్ను రద్దు చేసి మంత్రికి ఇచ్చిన ప్రత్యేకాధికారాన్ని ఉపసంహరించుకున్నందున రాఘవ్ చద్దాకు ఆ బంగ్లాలో కొనసాగే హక్కు లేదని కోర్టు తెలిపింది. ఏప్రిల్ 18న రాఘవ్ చద్దా బంగ్లాలో ఉండేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాటియాలా హౌస్ కోర్టుల అదనపు జిల్లా న్యాయమూర్తి సుధాన్షు కౌశిక్ ఆ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. అయితే మధ్యంతర ఉత్తర్వులను రీకాల్ చేయాలని కోరుతూ రాజ్యసభ సెక్రటేరియట్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
రాజ్యసభ సభ్యునిగా ఉన్న మొత్తం పదవీ కాలంలో వసతి గృహాన్ని స్వీకరించడానికి తనకు సంపూర్ణ హక్కు ఉందని రాఘవ్ చద్దా క్లెయిమ్ చేయలేరని కోర్టు(court) తెలిపింది. ప్రభుత్వ వసతి కేటాయింపు ప్రత్యేక హక్కు మాత్రమేనని తెలిపింది. ఆ క్రమంలో అలాట్మెంట్ను రద్దు చేసిన తర్వాత కూడా దానిని కొనసాగించడానికి అతనికి ఎటువంటి స్వార్థ పూరితమైన హక్కు లేదని కోర్టు వెల్లడించింది. అయితే రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు 2022లో పండారా రోడ్ బంగ్లా కేటాయించబడింది. ఇది టైప్ 7 వసతి గృహం. మార్చి 2023లో టైప్ 7 అతని హక్కు కంటే ఎక్కువగా ఉన్నందున దాని కేటాయింపు రద్దు చేయబడింది. అతనికి మరొక ఫ్లాట్ ఒకటి టైప్ 6 కేటాయించబడింది. ఆ క్రమంలో ఆ బంగ్లా రద్దుకు వ్యతిరేకంగా రాఘవ్ చద్దా కోర్టును ఆశ్రయించారు.
మరోవైపు తనకు ఎలాంటి నోటీసు లేకుండానే సక్రమంగా కేటాయించిన అధికారిక వసతిని రద్దు చేయడం ఏకపక్షంగా జరిగిందని చద్దా ఆరోపించారు. 70 ఏళ్లకు పైగా ఉన్న రాజ్యసభ చరిత్రలో ఒక సిట్టింగ్ సభ్యుడిని నివాసం ఉంటున్న బంగ్లా నుంచి తొలగించాలని కోరడం దారుణమన్నారు. ఈ విషయంలో చాలా అక్రమాలు జరిగాయని రాఘవ్ చద్దా(Raghav Chadha) అన్నారు. రాఘవ్ చద్దా ఇటీవలే బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇలా జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.