మణిపూర్‌లో మళ్లీ హింస మొదలైంది. రాష్ట్రంలోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో రెండు ఇళ్లకు నిప్పుపెట్టినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఇది కాకుండా, ఈ సమయంలో అనేక రౌండ్ల కాల్పులు జరిగాయి. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పట్సోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ కిథెల్‌మాన్‌బ్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
దొంగలు ఏకంగా ఓ బస్టాప్ షెల్టర్‌నే చోరీ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇలాంటి కేసు గతంలోనే అక్కడ రెండు నమోదు అయ్యాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఆ బస్ షెల్టర్‌ను చోరీ చేయడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. చోరీ చేసిన దుండగుల కోసం గాలిస్తున్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల తన తల్లి సోనియా గాంధీకి ఓ ప్రత్యేక బహుమతిని అందించారు. ఇది రాహుల్ తన కుటుంబంలో సరికొత్త సభ్యుడిగా పరిచయం చేసిన 'నూరి' అనే జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్కపిల్ల.
అస్సాంలో అరుదైన ఘటన జరిగింది. ఓ నవజాత శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పారు. అంత్యక్రియల కోసం తీసుకెళ్తుండగా ఆ చిన్నారి బతికింది. దీంతో సంతోషించిన పేరంట్స్.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కేవలం 72 గంటల్లోనే 31 మంది ప్రాణాలు కోల్పొయారు. అందులో 16 మంది నవజాతి శిశువులే ఉన్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆసుపత్రి డీన్‌ను విచారిస్తున్నారు.
ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ మహిళలకు ఇస్తామని స్పష్టంచేసింది. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా జారీచేసింది.
లక్నోలో ఓ ప్లాట్ లిప్ట్‌లో చిన్నారి చిక్కుకుంది. లిప్ట్ స్ట్రక్ అవడంతో ఆమె బాధ వర్ణణాతీతం. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
సిక్కింలో ఇటివల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 14 మంది మృతి చెందగా..100కుపైగా తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు సహాయక చర్యల కోసం హెల్ప్ లైన్ నంబర్, తాత్కాలిక సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ఎంపీని ఈడీ అరెస్ట్ చేసింది
చెక్ రిపబ్లిక్ (Czech Republic) రాజధాని ప్రేగ్‌లో (Prague) నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పాల్గొన్నారు.
శివసేన ఎంపీ హేమంత పాటిల్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది
తీస్తా నదిలో వరద బీభత్సం సృష్టించింది. నీటి వేగం చాలా ఎక్కువగా ఉంది. అది మంగన్ జిల్లాలోని టూంగ్ వంతెనను విచ్ఛిన్నం చేసింది. తద్వారా ఇతర జిల్లాలతో చుంగనాథ్ కనెక్టివిటీ తెగిపోయింది. ఫోడాంగ్ నుండి కూడా ఒక వంతెన కొట్టుకుపోయిందని వార్తలు వస్తున్నాయి. ఫోడాంగ్ - డిచ్కు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ విధ్వంసం కనిపించింది.
నేరస్తుల జీవితాలు జైళ్లలోనే మగ్గిపోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయాన్ని తీసుకొని విజయవంతంగా అమలుపరుస్తుంది. దీని వల్ల సమాజంలో కలిసిపోవడానికి, ఆత్మవంచన లేకుండా బతకడానికి వారికి విద్యా అవసరాన్ని గుర్తించి సాయం చేస్తోంది.
రైల్వేలో ఉద్యోగాల కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్(Lalu prasad yadav), ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వీ యాదవ్(Tejashwi Yadav)కు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.