అస్సాంలో అరుదైన ఘటన జరిగింది. ఓ నవజాత శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పారు. అంత్యక్రియల కోసం తీసుకెళ్తుండగా ఆ చిన్నారి బతికింది. దీంతో సంతోషించిన పేరంట్స్.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Assam Newborn Declared Dead By Hospital Comes Alive Seconds Before Cremation
Assam Newborn: చనిపోయింది అనుకున్న చిన్నారి బతికి వచ్చింది. అరుదైన ఘటన అస్సాంలో జరిగింది. అసోం సిల్పార్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు ఓ నవ జాత శిశువు చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఆ బాధతో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు చేయడానికి తీసుకువెళ్లారు. అక్కడ చిన్నారి మళ్లీ బతకడం విశేషం.
ఆరు నెలల గర్భిణీ పురిటి నొప్పులు పడుతుండగా, ఆమెను భర్త రతన్ దాస్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. కాంప్లికేటెడ్ గా ఉందని, తల్లి, బిడ్డల్లో ఒక్కరిని మాత్రమే బతికించగలమని వైద్యులు చెప్పారు. “మంగళవారం సాయంత్రం భార్యను సిల్చార్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాను, అక్కడ వైద్యులు గర్భంలో సమస్యలు ఉన్నాయని, వారు తల్లి లేదా బిడ్డను రక్షించగలరని చెప్పారు. మేము వారిని ప్రసవానికి అనుమతించాము. భార్య చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిందని డాక్టర్లు చెప్పారు. బుధవారం ఉదయం మృతదేహాన్ని అందుకున్నాము” అని మిస్టర్ దాస్ చెప్పారు.
చనిపోయిన బిడ్డను ప్యాక్ చేసి వైద్యులు వారికి అందజేశారు. ఆ బిడ్డకు అంత్యక్రియలు జరిపేందుకు వారు స్మశాన వాటికకు తీసుకువెళ్లారు. సడెగా అక్కడకు వెళ్లిన తర్వాత బిడ్డ మళ్లీ ఏడ్వడం వినపడింది. మళ్లీ బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.