»Bus Stop Theft Police Shocked By What Thieves Did
Bus Stop Stolen: బస్ స్టాప్ చోరీ..దొంగలు చేసిన పనికి పోలీసులు షాక్
దొంగలు ఏకంగా ఓ బస్టాప్ షెల్టర్‌నే చోరీ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇలాంటి కేసు గతంలోనే అక్కడ రెండు నమోదు అయ్యాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఆ బస్ షెల్టర్‌ను చోరీ చేయడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. చోరీ చేసిన దుండగుల కోసం గాలిస్తున్నారు.
దొంగలు చేసిన పనికి పోలీసులు (Police) షాక్ అయ్యారు. ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటు చేసిన బస్ స్టాప్ (New Bus Stop)కు సంబంధించి స్టీల్ స్ట్రక్చర్ (Steel Structure) చోరీ అవ్వడం అధికారులకు షాకిచ్చింది. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)లో చోటుచేసుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో బస్ షెల్టర్ల (Bus Shelters)ను బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయిన బీఎంటీసీ (BMTC) నిర్వహిస్తోంది. అయితే కన్నింగ్హోమ్ రోడ్డులో ఉన్నటువంటి బస్ స్టాప్ ఈ మధ్య రాత్రికి రాత్రే మాయం అయ్యింది.
రూ.10 లక్షల విలువైన ఇనుప నిర్మాణం చోరీ కావడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బెంగళూరులో ఇలా బస్టాప్ షెల్టర్లు (Bus Shelters) చోరీ కావడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో హెచ్ఆర్బీఆర్ లేఅవుట్ వద్ద మూడు దశాబ్దాల నాటి బస్ షెల్టర్ కూడా రాత్రికి రాత్రే దుండగులు మాయం చేశారు.
2015లో కూడా ఓ స్కూల్ సమీపంలో ఉన్నటువంటి దూపనహళ్లి బస్టాప్ (Bus Shelters) కూడా రాత్రికి రాత్రే అదృశ్యమవ్వడం కలకలం రేపింది. 2014లో కూడా రాజరాజేశ్వరి నగర్ లోని బీఈఎంఎల్ లేఅవుట్ వద్ద ఉన్న 3వ స్టేజీ బస్టాప్ కూడా కనిపించకుండా పోయింది. ఆ బస్టాప్ షెల్టర్ 20 ఏళ్ల నాటిది కావడం విశేషం. ఇలా బస్టాప్‌లు కనపడకుండా పోవడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణను ప్రారంభించారు. త్వరలోనే నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.