స్కైబస్ ద్వారా ట్రాఫిక్ తగ్గుముఖం పడుతుందని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Minister Nitin Gadkari) తెలిపారు. అర్బన్ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. షార్జాలోని ‘పైలట్ సర్టిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆఫ్ యూస్కై టెక్నాలజీ (Yusky Technology)’ని మంత్రి గడ్కరీ (Nitin Gadkari) సందర్శించారు.స్కైబస్ స్థిరమైన, రద్దీలేని అర్బన్ మొబిలిటీ సొల్యూషన్ను అందిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. ఈ రవాణా మార్గం అందుబాటులో వస్తే కాలుష్యంతోపాటు.. ట్రాఫిక్ తగ్గుముఖం పడుతుందని అన్నారు. అర్బన్ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు.
దీనిని నిర్మించేందుకు రైల్ కేబుల్ సిస్టమ్(Cable system)ను వినియోగించడం వల్ల భూ సేకరణ అవసరం ఎక్కువగా ఉండదని ఆయన పేర్కొన్నారు. దేశ రవాణా మౌలిక సదుపాయాల్లో ఇది ఎంతో కీలకం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇతర రవాణా వ్యవస్థలతో పోలిస్తే ఈ స్కై బస్(Sky Bus)ల నిర్మాణం, నిర్వహణ చాలా తక్కువని వెల్లడించింది. అక్టోబర్ 2న చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్(Prague)లో నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్లో గడ్కరీ పాల్గొన్నారు. అనంతరం ఆయన అక్కడే హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సులో ప్రయాణించారు. తాజాగా స్కైబస్ ఎక్కి దాని ప్రత్యేకతల గురించి తెలుసుకున్నారు.