Governor Tamilisai in love with Anaconda on World Animal Day
Governor Tamilisai: ప్రపంచ జంతు దినోత్సవం(World Animal Day) సందర్భంగా గవర్నర్ తమిళి(Tamilisai Soundararajan)సై వన్యప్రాణుల వద్దకు వెళ్లారు. భారీ అనకొండను చేతుల్లోకి తీసుకున్నారు. అనకొండతో కూడిన ఫోటోను ట్వీట్ చేశారు. ఎక్స్‌లో ఫోటోతో పాటు సందేశాన్ని రాసుకొచ్చారు. ప్రపంచంలో మానవుల జీవితం, జీవనోపాధి ఎంత ముఖ్యమైందో, జంతువుల జీవితం, జీవనశైలి కూడా అంతే ముఖ్యమైందని పేర్కొన్నారు. జంతువులకు హాని కలగకుండా స్వేచ్ఛగా జీవించేందుకు మనమందరం అండగా ఉండాలన్నారు. జంతువులను రక్షించడం, వాటిపై క్రూరత్వాన్ని నిరోధించడం గురించి అవగాహన కల్పించడానికి అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ జంతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.. ఈ స్ఫూర్తితో వన్యప్రాణుల పట్ల సానుకూల దృక్పథంతో కొనసాగాలన్నారు.
உலகில் மனிதர்களின் வாழ்விடமும்,வாழ்வாதாரமும் எவ்வளவு முக்கியமோ,அதேபோல விலங்குகளின் வாழ்விடமும்,வாழ்க்கை முறையும் முக்கியமானதாகும். விலங்குகளுக்கு ஆபத்து விளைவிக்காமல் அவை முழு சுதந்திரமாய் இந்த உலகில் வசிக்க மனிதர்களாகிய நாம் அனைவரும் துணை நிற்போம்.… pic.twitter.com/xqJGoZISWI
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) October 4, 2023